గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు, అకాల వరదల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలంగా మారినసంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్.. విజయవాడ, ఖమ్మం ప్రజలు మరింతగా సతమతమవుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం తో పాటు.. ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. ఈ క్రమంలో ఈ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వారితో పాటు.. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా తమ సహాయాన్ని అందించి తమ మంచితనాన్ని చాటుతున్నారు.
చాలామంది లక్షలాది రూపాయలను విరాళంగా ప్రకటించి వారికి అండగా నిలబడుతున్నారు. ఇక పాన్ నేను స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఎప్పుడు ఎదుటివారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ వరద బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి సహాయనిధులకు.. ఒక్కో రాష్ట్రానికి రెండున్నర కోట్ల చొప్పున మొత్తంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడంటూ వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. ఇవన్నీ కేవలం రూమర్‌లని.. ఇందులో నిజం ఏమాత్రం లేదంటూ తేలిపోయింది. కాగా కొద్దిసేపటి క్రితం ప్రభాస్ తన వంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు.. ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున రెండు కోట్ల విరాళాన్ని అందించారు. అయితే ఇప్పటివరకు విరాళాన్ని అందించిన తెలుగు స్టార్స్ అందరిలో ప్రభాస్‌దే అత్యధిక విరాళం కావడం విశేషం. ఇక ప్రభాస్ తో పాటు.. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్ కూడా తమ సహాయాన్ని అందించి అండగా నిలుస్తున్నారు.