నరకం అనుభవించా.. తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సినీ సెలబ్రిటీల లైఫ్ బయట నుంచి చూస్తే ప్రేక్షకులకు ఎప్పుడు అర్థాలు మెడల పోట్రే అవుతూ ఉంటుంది. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. హ్యాపీ ఫ్యామిలీనే లీడ్‌చేస్తూ ఉంటారని.. బాధలనేవి తెలియకుండా జీవిస్తార‌ని అంతా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒకసారి వారి జీవితంలోనికి తొంగి చూస్తే.. వారి లైఫ్ లో ఉండే విషాదాలు తెలుసుకుంటే.. ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయి. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సినీ నటీనటులు ఎంతోమంది ఉన్నారు. బయటకు చెప్పుకోలేని సమస్యలను కూడా వారు అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవేవీ తమ అభిమానులకు తెలియకుండా తమ నటనతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

Punjab Kings owners at war as Preity Zinta takes matter to court before IPL  2025 auction

అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా ఒకటి. నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడిన ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై మాత్రం మహారాణిగా నవ్వులు పోయించింది. ప్రీతి జింటాకు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులోను పలు సినిమాలో నటించింది. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయాన్ని గురించి మాట్లాడుతూ.. తల్లి అయ్యేందుకు ఆమె పడిన బాధలను చెప్పుకొచ్చింది. అందరి జీవితాల్లో లాగే.. నా లైఫ్ లో కూడా గుడ్ డేస్‌తోపాటు.. బ్యాడ్ డేస్ కూడా ఉన్నాయంటూ వివరించింది. రియల్ లైఫ్ లో హ్యాపీగా ఉండేందుకు ఎన్నోసార్లు టార్చ‌ర్ చూశానంటూ వివ‌రించింది.

ముఖ్యంగా పిల్లల కోసం ivf ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నరకాన్ని అనుభవించా.. కొన్నిసార్లు తలగోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది.. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయేదాని.. అయినా ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో చివరిగా సరోగసి ద్వారా తల్లినయ్యా అంటూ ప్రీతి జింటా వివరించింది. ఇక 2016లో అమెరికాకు చెందిన జీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈ అమ్మ‌డు 2021లో సరోగ‌సి ద్వారా.. కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల విరమం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. సన్నీడియోల్ హీరోగా నటిస్తున్న లాహర్ 1947.. మూవీలో కీలకపాత్రలో మెప్పిస్తుంది ప్రీతి జింతా. రాజ్ కుమార్ సంతోషి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.