రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన తెలుగు స్టార్స్ ఎవరో.. ఎవరెవరు ఎంత విరాళం ఇచ్చారో.. ఒకసారి తెలుసుకుందాం.
ఇలా ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, అల్లు అర్జున్ వీరంత ఎవరికి వారు తమ వంతు సహాయంగా ఒకొక్కరు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర ప్రజలు కష్టాలు తమను కలిచి వేస్తున్నాయని.. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫాండ్స్ వేస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే వీరికి అండగా నిలిచేందుకు మరింతమంది చేతులు కలపాలని వారు వివరించారు. ఇక వీరితో పాటే పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక రాష్ట్రానికి కోటి రూపాయల చొప్పున రెండు కోట్లు విరాళాన్ని అందించాడు.
అలాగే మీడియం రేంజ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నటి అనన్య నగళ్ళ లాంటి వారు కూడా సియం రిలీఫ్ ఫండ్‌కు విరాళాన్ని అందజేశారు. సిద్దు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్క రాష్ట్రానికి రూ.15 లక్షల చొప్పున రూ.30 లక్షల విరాళాన్ని అందించగా.. విశ్వక్ సేన్ ఒక్కో రాష్ట్రానికి రూ.5 లక్షల విరాళం చొప్పున.. 10 లక్షల అందజేశాడు. ఇక టాలీవుడ్‌లో నటిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనన్య నాగళ్ళ కూడా.. రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం ఒక్క రాష్ట్రానికి రూ.2.5 లక్షల విరాళాన్ని అందజేసింది. ఇలా ఇప్పటివరకు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ వారికి తోచిన సహాయాన్ని అందిస్తూ.. ఈ ఫ్లడ్స్ బారి నుంచి వారు త్వరగా బయటపడాలంటే కోరుకుంటున్నారు.