టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న గ్రాండ్గా మొదలైన ఈ షోకు మళ్ళీ అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ సింగిల్‌గా కాకుండా.. జంటలు జంటలుగా ఎంట్రీ ఇచ్చారు. అన్ని సీజన్లో కంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ షోను ఈసారి డిజైన్ చేశారు. దీంతో ముందర సీజన్ల కంటే ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇంట్లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి వార్ మొదలైపోయింది. అందరూ మేము ఏం తక్కువ కాదని నువ్వా.. నేనా.. అన్నట్లుగా కొట్లాడుకుంటున్నారు.
అప్పుడే నామినేషన్స్ కూడా ప్రారంభించేశారు. ఈ వారం ఇంట్లో నుంచి బయటకు పంపడానికి ఇప్పటికే కొంతమంది పేర్లు సెలెక్ట్ అయిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన లవ్ బర్డ్స్.. నాగ చైతన్య, శోభిత జంట బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళబోతున్నట్లు సమాచారం. కంటి స్టెంట్‌లను కలిసి మాట్లాడడానికి.. వారిని టాస్కులు బాగా ఆడించేందుకు ప్రోత్సహించడానికి.. గెస్ట్‌లుగా కాసేపు వీరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తుంది.
దీనికోసం బిగ్బాస్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. వినాయక చవితి పండగ సందర్భంగా ఈ జంట హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇప్పటికే ఈ వార్త బయటకు రావడంతో.. ఎప్పుడెప్పుడు ఈ జంట షోకు వస్తారా అంటూ అక్కినేని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా చైతన్య.. సమంతతో విడాకుల తర్వాత యంగ్ బ్యూటీ శోభితతో ప్రేమలో పడి.. రాహస్య ప్రేమాయణం తర్వాత.. కొంతకాలం క్రితం ఆగస్టు 8న ప్రైవేట్ గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక వీరిద్దరూ రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.