టాలీవుడ్ యంగ్ టైగర్ తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం.. అనిరుధ్ సంగీతం అందించడం.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచుతున్నాయి. ఇక ఇప్పటికే కొరటాల శివ, తారక్ కాంబోలో జనతా గ్యారేజ్ వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్టీఆర్ దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ తారక్ అభిమానులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ నుంచి సినిమా రిలీజ్ అయి దాదాపు మూడేళ్లు అవుతుండడంతో.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుంచి సినిమా రిలీజ్ అవుతుందా అంటూ తారక్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల మిగిలి ఉండడంతో మేకర్స్ కూడా మెల్లమెల్లగా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నారు. ఇక ఇప్పటికే దేవర నుంచి ఫస్ట్ రెండు సింగిల్స్ రిలీజై సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్ , గ్లింప్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం దేవర దావూదీ సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక గత రెండు రోజులుగా ఈ దేవర దావూదీ సాంగ్ రిలీజ్ కాబోతుందంటూ.. స్టెప్స్ అదిరిపోతాయంటూ యూనిట్ సోషల్ మీడియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. వారు చెప్పినట్లుగానే తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రస్తుతం నెటింట ట్రెండింగ్‌గా మారింది. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ ఈ సాంగ్ తన స్టైల్ లో స్టెప్పులతో దుమ్మురేపాడు. ఎన్టీఆర్‌తో పాటు.. జాన్వి కూడా గట్టి పోటీ ఇస్తూ డ్యాన్స్‌తో అదరగొట్టింది. మీరు ఈ సాంగ్ ను ఓ లుక్కే వేసేయండి.