నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఐదు దశాబ్దాలుగా ఒక్క ఏడాది కూడా బ్రేక్ లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అభిమానితో ముద్దుగా బాలయ్య అని పిలిపించుకునే నటసింహం ఇటీవల ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో 108 సినిమాల్లో నటించిన బాలయ్య.. ప్రస్తుతం కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాల్లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. ఇక బాలయ్య సినిమాలు రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు రికార్డులను తిరగరాస్తు ఉండే బాలయ్య.. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ రికార్డులను క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అలా బాలయ్య సొంతం చేసుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ రికార్డులను ఇప్పటివరకు ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో టచ్ చేయలేకపోయారు. ఇకపై టచ్ చేయడం కూడా సాధ్యం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటి టైం ట్రావెలర్ సినిమాగా బాలయ్య నటించిన ఆదిత్య 369 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో తెరకెక్కి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక అదే సంగీతం క్షనీవాస్ డైరెక్షన్లో వచ్చిన మరో మూవీ భైరవద్వీపం. ఈ సినిమాలో కురూపిగా కనిపించిన బాలయ్య తన నటనతో మంచి మార్కులు కొట్టేసాడ. ఇక మరో పక్క ఫ్యాక్షనిస్టుగా తన విశ్వరూపాన్ని చూపించాడు. సమరసింహారెడ్డి తో వైట్ అండ్ వైట్లో కనిపించి ధియేటర్లను షేక్ చేసి అప్పట్లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక బోయపాటి – బాలయ్య మొట్టమొదటి మూవీ సింహ. క్లాస్ అండ్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌కి టర్నింగ్ పాయింట్.
బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేయడమే కాదు.. ఈ సినిమాలో డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికి డైలాగ్స్ చాలా మందిలో గుర్తుండిపోయి ఉంటాయి. ఇక ఈ మూవీ 400 రోజులకు పైగా చాలా ధియేటర్లలో ప్రదర్శించబడింది. కర్నూలులో ఏకంగా వెయ్యి రోజులు ఆడింది. ఇక నాన్ స్టాప్ యాక్షన్ తో తెరకెక్కిన మరో మూవీ అఖండకు థియేటర్లు బ్లాస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య – బోయపాటి కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్యాక్షన్ కథాంశంతో రూపొందిన వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య మరో బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 108 అడుగుల కటౌట్ పెట్టి మరి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు.