టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చరణ్.. ఇప్పటివరకు మరో సోలో సినిమాతో వెండితెరపై ఆడియన్స్‌ను పలకరించలేదు. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రావాల్సిన ఈ సినిమాను దర్శకుడు ఇండియన్ 2 సినిమా షూట్ తో బిజీగా ఉండడం వల్ల.. ఆలస్యం చేశాడు. అటు ఇండియన్ 2.. ఇటు గేమ్ చేంజర్.. రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో బిజీ అయినా శంకర్.. ఇండియన్ 2 రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.
ఇక కొంతకాలం క్రితం వరకు గేమ్ చేంజర్‌పై విపరీతమైన హైప్ ఉన్నా.. ఇండియన్ 2 రిలీజ్ చేసిన తర్వాత గేమ్ చేంజర్ పైన మెల్లమెల్లగా అభిమానుల్లో కూడా నమ్మకం తగ్గుతుంది. శంకర్ టేకింగ్, మేకింగ్ పై అందరికీ సందేహాలు మొదలయ్యాయి. శంకర్ ఈమూవీ ఎలా రూపొందించి ఉంటాడో.. ఈ సినిమాతో.. చరణ్ కు సక్సెస్ ఇస్తాడో.. లేదో.. అనే సందేహాలు మొదలైపోయాయి. దిల్ రాజుతో ఈ సినిమాకు ఇప్పటికే డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్న శంకర్.. దాదాపు రూ.300 కోట్ల వరకు బడ్జెట్ పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల ఓ స్టేజిపై వివరించారు. కానీ.. ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే చరణ్ తన ఎంటైర్ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.
కానీ.. కొన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉంటే కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు, అలాగే డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే ఆయన చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో 100% ఇవ్వడానికే అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు చరణ్. అలా తన మొత్తం కెరీర్‌లో తాను చేసిన అన్ని సినిమాలలో రెండు సినిమాలంటే ఆయనకు అసలు నచ్చవట. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. వాటిలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ రీ రీమేక్ అయిన జంజీర్ సినిమా.. మరొకటి శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన బ్రూస్లీ. ఈ రెండు సినిమాలు రాంచరణ్ కు అస్సలు నచ్చవని తెలుస్తుంది. ఇక ఆయన కెరీర్ కు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి కూడా ఇవే ప్రధాన కారణం. ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆయన క్రేజ్ చాలా వరకు తగ్గింది. దీంతో ఈ రెండు సినిమాలంటే రామ్ చరణ్ కు అసలు ఇష్టం ఉండదట.