టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తనదైన నటనతో నవ మన్మధుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన వయసులోనూ యంగ్ హీరోలా.. ఫిట్నెస్, హ్యాండ్సమ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. నాగార్జునతో పాటు.. ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వీళ్ళు ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. ఫ్యూచర్లో కచ్చితంగా వీరిద్దరికీ స్టార్ హీరో స్టేటస్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే ఒక పక్కన సినిమాల్లో రాణిస్తూనే.. మరో పక్కన బిజినెస్ లోను తనదైన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో, ఇతర బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్న నాగార్జునకు.. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాకులపై షీక్‌లు ఇస్తుంది.
ఆయన హైదరాబాదులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ను గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసిన సంగతి తెలిసిందే. కబ్జా చేసి నిర్మించారంటూ ఆ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసి షాక్ ఇచ్చింది. అయితే అక్కినేని నాగార్జునకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా.. పొద్దుపొద్దున్నే హైడ్రా అధికారులు వచ్చి వెనుకన్వెన్షన్ ను నాశనం చేసేశారు. దీంతో నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఈయనకు అంత ఎదురు దెబ్బ తగిలితే.. కనీసం టాలీవుడ్ సెలబ్రిటీలలో ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.