టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్‌తో స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోయిన వారిలో కొరటాల శివ ఒకడు. మిర్చి సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. వరుస సినిమాలను తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతి తక్కువ సమయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిన కొరటాల.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించిన ఆశ్చర్య సినిమాతో డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ సినిమా ఘోరపరాజయంతో ఎన్నో విమర్శలను చూశాడు. కాగా.. కొరటాల ఈ మూవీ తర్వాత తెరకెక్కిస్తున్న తాజా మూవీ దేవర.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. జాహ్నవి కపూర్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాం సెప్టెంబర్ 27న (రేపు) గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీమియర్ షోను మరికొద్ది గంటల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషనల్ భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కొరటాల. ఆ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ దేవర 2 కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. దేవర 2 మూవీ స్టార్ట్ కావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందంటూ వివరించాడు.
దానికి కారణం ఏంటో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమాలో ఎంతోమంది నటీనటులు ఉన్నారని.. వాళ్ళందరి డేట్లు అడ్జస్ట్ చేసుకొని సినిమాను తెరకెక్కించడం అంటే కొంచెం కష్టతరమైన పని అంటూ చెప్పుకొచ్చాడు. వారి డేట్స్ అన్ని అడ్జస్ట్ అయ్యాక దేవర 2ను ప్రారంభిస్తామని.. ఆ సినిమా కాస్త లేట్ అయ్యేటట్లు ఉంది.. ఈ క్రమంలో నేను మరో సినిమా చేసి తర్వాత దేవర పార్ట్ 2ను మొదలు పెట్టొచ్చు అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అంటే కొరటాల దేవర ఆల్మోస్ట్ లేట్ కాబోతున్నట్లు చెప్పకనే చెప్పేసాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా ఇరకాటంలో పడ్డారు. ఇదెక్కడి ట్విస్ట్‌రా స్వామి.. దేవర రిలీజై రిజల్ట్ వచ్చినా వెంటనే పార్ట్ 2ను ప్రారంభించడా.. మధ్యలో ఇంకో సినిమా ఉందా అంటూ షాక్ అవుతున్నారు.