టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పలో నటనకు నేషనల్ అవార్డు దక్కించుకుని ఫుల్ జోష్తో ఉన్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప సీక్వెలట్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పుష్ప రాజ్ మరోసారి రికార్డ్ క్రియేట్‌చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్‌తో సినిమాలు నటించబోతున్నాడని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ క్రమంలోనే పుష్ప 2తర్వాత సినిమాపై కూడా అల్లు అర్జున్ భారీ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఇక పుష్ప తర్వాత సందీప్ వంగాతో సినిమాను అనౌన్స్ చేశాడు బన్నీ. కానీ దానికన్నా ముందే మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకున్న సంగతి తెలిసిందే. అలా వారి కాంబోలో అలవైకుంఠపురం సినిమా రిలీజై నాన్ బాహుబలి రికార్డును తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ కోసం త్రివిక్రమ్ మరో బ్లాక్ బస్టర్ కథను రెడీ చేసుకున్నాడని.. అది అల్లు అర్జున్‌కు కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ ప్రయోగాత్మక కథను త్రివిక్రమ్ బన్నీ హీరోగా తెరకెక్కించనున్నాడని.. ఓ పిరియాడికల్ డ్రామాగా ఫాంటసీ మూవీగా సినిమా రానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక కథ కంటే ఎక్కువగా త్రివిక్రమ్ తన సినిమాలో డైలాగ్స్‌తోనే బ్లాక్ బస్టర్లు అందుకుంటాడు.
అలా అల్లు అర్జున్‌తో నెక్స్ట్ చేయబోయే సినిమా ప్లానింగ్ వేరే లెవెల్‌లో ఉందని సమాచారం. ఇక త్రివిక్రమ్ భారీ స్కేల్ సినిమాలను మొదలు పెడితే పాన్ ఇండియా లెవెల్‌లో మరోసారి తన సత్తా చాటుకోవడం ఖాయమంటూ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోస్‌గా పాన్ ఇండియన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారంతా.. వరుస సినిమా లైనప్ తో బిజీగా గడుపుతున్నారు. తమ నెక్స్ట్ సినిమాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్లు కూడా వచ్చేస్తున్నాయి. కేవలం అల్లు అర్జున్ నుంచి మాత్రమే తన కొత్త సినిమాల విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపించడం.. ఒక్క ఆఫీషయల్ అనౌన్స్మెంట్ కూడా బయటకు రాలేదు. ఈ క్రమంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని టాక్ నడుస్తుంది. వచ్చే ఏడాదిలోనే సినిమా షూటింగ్స్ మొదలుకానుందట. అందుకు మేకర్స్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. ఈ వార్తల్లో నిజమెంతుందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ తెలియదు.