ఎన్టీఆర్ ఈ సినిమా రికార్డ్ చూస్తే మైండ్ బ్లాకే.. ఇప్పటి కలెక్షన్లతో పోలిస్తే ఓ పది బాహుబలిలకు సమానం..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలో రిలీజ్ అయి కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన త‌న సినిమాతో కొల్లగొట్టిన రికార్డును కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. అయితే కేవలం తెలుగులోనే రిలీజై ఆరెంజ్ వజూళ్ళ‌ను కల్లగొట్టింది. ఎన్టీఆర్ అసలు సిసలు ఊచకోత అది. ఇత‌ర ఏ భాషలో రీమేక్ కానీ.. డబ్ కానీ చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సినిమా వసూళ్లు ఇప్పటి విలువలో పది బాహుబలిల కంటే ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Adavi Ramudu (1977) - IMDb

అదే 1977లో సీనియర్ ఎన్టీఆర్ అడవి రాముడు. ఈ సినిమా గురించి ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటూనే ఉంటారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ఈ అడవి రాముడు సినిమా ఎప్పుడు ప్రేక్షకుల బ్రెయిన్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ గురించి కూడా కథలుగా చెప్పుకునే వారు. ఎన్టీఆర్‌కు సక్సెస్‌లు, రికార్డులు వెన్నతో పెట్టిన విద్య. పౌరాణిక, జానపదాల్లో చాలా రికార్డులు బ్రేక్ చేసిన ఈయన.. సాంఘిక సినిమాల్లో గుండమ్మ కథ, రాముడు భీముడు లాంటి సినిమాలతో రికార్డుల వర్షం కురిపించాడు. ఇక ఈ అన్ని సినిమాల కంటే అడవి రాముడు మరో లెవెల్. అసలు టైటిల్ లో రాముడు పేరును తగిలించడమే బ్రహ్మాండం అనడంలో సందేహం లేదు. ఇక ఎన్టీఆర్ నటించిన రాముడు సినిమాలన్నీ అప్పట్లో రికార్డుల వర్షాన్ని కురిపించాయి. అయితే ఈ సినిమాలన్నింటిలో అడవి రాముడు హైలెట్.

Adavi Ramudu Telugu Full Movie | NTR | Jayaprada | K. Raghavendra Rao -  Google Playలో సినిమాలు

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 47 ఏళ్లు పూర్తయిన ఇప్పటికీ నిన్ననో మొన్ననో తెరకెక్కించిన సినిమాల ఆడియన్స్ అంతా ఇన్వాల్వ్ అయిపోయి చూసేస్తూ ఉంటారు. ఇక సినిమా హిట్ అవ్వడానికి మరో ప్రధాన కారణం వేటూరి సుందరరామమూర్తి, కేవీ మహదేవన్లు. సినిమాలో అన్ని పాటలు వేటూరి రాయగా.. కెవి మహదేవన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ఖుషి ఉంటే మనుషులు ఋషులవుతారు పాట ఈతరం జనరేషన్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. గిరిజనులను ఉత్తేజ పరిస్థితి ఏకలవ్యుడు, వాల్మీకి, సబరి పాత్రల గురించి వర్ణిస్తూ పాడే ఈ పాట అంద‌రినీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇందులోనే ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి ఈ పాట కూడా ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అప్పట్లో ఇదొక్కటే కోటి రూపాయల పాట అని అంటూ ఉండేవారు.

Ntr adaviramudu film will re release on his birth anniversary full details  are inside | NTR AdaviRamudu: సీనియర్ ఎన్టీఆర్ 'అడవిరాముడు' రి-రిలీజ్ - ఆ  విషయంలో ఫీలవుతున్న ఫ్యాన్స్?

అలా ఈ సినిమాలో వచ్చిన అన్ని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ మదిలో ఫీడ్ అయిపోయాయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత 32 సెంటర్లో వంద రోజులు.. 16 సెంటర్లలో 25 వారాలు.. ఎనిమిది సెంటర్లో 200 రోజులు.. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, తిరుపతి సెంటర్లలో సంవత్సరం పాటు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంది. కలెక్షన్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ల పంటపండి కాసుల వర్షం కురిసింది. ఒక్కక‌ ప్రేక్షకుడు సినిమాను నాలుగైదు సార్లు చూసిఉంటారు. ఇక అప్పట్లో టికెట్ల ధరలు ఇంచుమించు 50 పైసలు ఉండేది. ఆ టైం లోనే ఏకంగా రూ.6.5 కోట్ల కలెక్షన్లు.. రూ.3.25 కోట్ల షేర్ వ‌సూళ్ళు కొల్లగొట్టడం.. అది కూడా కెవ‌లం తెలుగులో మాత్ర‌మే రిలీజై ఈ రేంజ్ రికార్డ్ క్తియేట్ చేయ‌డం గ‌మ‌నార్హం. అలా అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లను ఇప్పటి డబ్బులతో.. టికెట్ కాస్ట్తో చూస్తే.. అది దాదాపు పది బాహుబలిలను మించి పోతుందనడంలో సందేహం లేదు.