ఆర్ సి 16 లోడింగ్.. నయా లుక్ కోసం చెర్రీ కసరత్తులు షురూ..!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజ‌ర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించింది. ఇక ఈ సినిమా ఈ ఏడది డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా షూట్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది.

RC 16 | 31 Interesting Facts | Ram Charan | Vijay Sethupathi | Janhvi  Kapoor| NV Prasad|UV Creations - YouTube

ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ కూడా ఆలస్యమైంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తన 16 సినిమాను నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ లెవెల్ లో జరిగాయి. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్.. చెరణ్ఖ‌/ జంటగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక త్వరలోనే ఆర్సి16 సెఠ్‌స్ పైకి రానిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చరణ్ తన కొత్త లుక్ కోసం కసరత్తులు ప్రారంభించేశాడు.

అందుకోసమే ప్రముఖ ఫిట్నెస్ కోచ్‌ శివోహంతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ట్విట్టర్ వేదికగా అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. బీస్ట్ మోడ్ ఆన్.. అంటూ దానికి క్యాప్షన్ జోడించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. అథ్లెట్ లుక్ కోసం చెర్రీ కష్టపడుతున్నట్లు సమాచారం. కాగా ఫిట్నెస్ ట్రైనర్ రామ్ చరణ్‌తో పాటు గతంలో అమితాబచ్చన్‌, జాక్వాలిన్ లాంటి స్టార్ సెలబ్రిటీలకు కూడా కోచ్‌గా వ్యవహరించాడు.