నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా తెరకెక్కనున్నఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇక దేవర పార్ట్ 1 ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్తో దూసుకుపోతున్నాయి. ట్రైడింగ్ టాప్ 25 జాబితాలో నాలుగు స్థానాలను ఈ సినిమా పాటలే దక్కించుకోవడం దేవర సరికొత్త రికార్డ్. అలా దేవరలోని దావూదీ తెలుగు మొదటి స్థానం దంకించుకుని రికార్డ్ సృష్టించింది.
ఇక దావుది హిందీ వర్షన్ సాంగ్ 7వ స్థానాన్ని.. ఆ పాట తరువాత చుట్టుమల్లె చుట్టేసావే తెలుగు సాంగ్ 18వ స్థానని.. దావూది తమిళ్ 25వ స్థానాన్ని దక్కించుకుని దూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని కొత్త పోస్టర్ ద్వారా మూవీ టీం పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. లాస్ ఏంజెల్స్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక బియాండ్ ఫెస్ట్‌లో దెవరా ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే.
ట్రైలర్ రిలీజ్ కాకముందే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన మొదటి తెలుగు సినిమాగాను రికార్డ్స్ సృష్టించింది. ఇక తారక్ నుంచి దాదాపు ఆరేళ్ల తర్వాత వస్తున్న సోలో మూవీ కావడం.. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో సినిమాపై విపరీతమైన అంచనాలనుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ప్రేక్షకులు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ చివరి 4 నిమిషాలు హైలెట్ కానుంది అంటూ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.