గ్రాఫిక్స్ పై అద్భుతమైన పట్టు సాధించిన రాజమౌళి.. అదెలా సాధ్యమైంది అంటే..?

మూవీ దర్శకులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త టెక్నాలజీల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉండాలి. ప్రేక్షకుల అభిరుచులు, టెక్నాలజీ, గ్రాఫిక్స్ ఇలా అన్నిటిపై వారికి పూర్తి అవగాహన ఉంటేనే సినిమాతో సక్సెస్ అందుకోగలరు. అలాంటి అవ‌గాహ‌న‌తో సినిమా తీసి స‌క్స‌స్ అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ ను పూర్తి లెవెల్ లో రాజమౌళి వాడేస్తూ ఉంటాడు. ఒకప్పుడు డైరెక్టర్గా ఛ‌త్రపతి, విక్రమార్కుడు, సై, సింహాద్రి లాంటి మాస్ యాక్షన్ సినిమాలు సినిమాలను తీసి సూపర్ సక్సెస్ అందుకున్న జక్కన్న తర్వాత అలాంటి తీయడం ఆపేసాడు. కార‌ణం ఆడియ‌న్స్‌కు రొటీన్‌కు భిన్నంగా సినిమాలు ఉండాల‌నేది ఆయన ఉద్దేశం.

Ss Rajamouli,HBD Rajamouli: తెలుగు సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌కి  తీసుకెళ్లిన దర్శకధీరుడు - pan india director ss rajamouli birthday special  - Samayam Telugu

ఇక గ్రాఫిక్స్ ను ఎంత బాగా చూపించినా.. ఆయన పూర్తిగా గ్రాఫిక్స్ పై ఆధారపడరు. సినిమా ఎలివేట్ కావడంలో గ్రాఫిక్స్ ను సరిగా ఉపయోగించుకుంటారు. ఎమోషన్, రివెంజ్ లాంటి ఎలిమెంట్స్ కూడా తప్పకుండా ఉండేలా తన సినిమాను బ్యాలెన్స్ చేస్తాడు. రాజమౌళి తన సినిమాల్లో విజువలైజేషన్ స్టాండర్డ్స్ కూడా ఎప్పుడు ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటాడు. అలా ఇప్పటివరకు ఆయన డైరెక్షన్‌లో తెర‌కెక్కిన యమదొంగ నుంచి ఆర్‌ఆర్ఆర్ వరకు గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అయితే ఇటీవల కాలంలో పాన్‌ ఇండియా సినిమాలుగా వ‌చ్చిన ఆది పురుష్‌, క‌ల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ అంతగా వర్కౌట్ కాలేదు. రాజమౌళి గ్రాఫిక్స్ విషయంలో ఎవ‌రు బీట్ చేయలేని విధంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.

RRR: YS Jaganతో SS Rajamouli సమావేశం - Telugu Oneindia

ఆయనకు గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోవచ్చు కానీ.. గ్రాఫిక్స్ డిజైనర్లతో తనకు నచ్చిన విధంగా ఎన్నో రకాలుగా డిస్కషన్ చేసి ఆ ఫీల్డ్ గురించి అవగాహన తెచ్చుకుని.. తనకు కావలసిన ఔట్‌పుట్ ఎలా రాబట్టాలో అలా రప్పించుకుంటారు. అందుకే ఆయన సినిమాల్లో గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా నిజంగా జరిగినట్లు మనకి అనిపిస్తాయి. నిజానికి రాజమౌళి కంప్యూటర్ గ్రాఫిక్స్ పై ఎక్కువగా ఆధారపడరు. దానిపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే సినిమాలో ఆ గ్రాఫిక్స్ లపై రాజమౌళి ఫోకస్‌పెట్టాడు. కేవలం గ్రాఫిక్స్ డిజైనర్ల పై ఆధారపడితే సరిగా ఉండదని స్వయంగా తన పని తాను చేసుకుంటేనే అది పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన భావిస్తూ ఉంటారు. సినిమా ఏ మాత్రం చెడిపోకుండా గ్రాఫిక్స్ లో ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకునే విషయంలో రాజమౌళి ముందంజలో ఉంటాడు. అందుకే ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల కలెక్షన్లను కల్లగొట్టి బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి.