రెంట్ కట్టలేక రూమ్ ఖాళీ చేశా.. త్రివిక్రమ్ పనికి షాక్ అయినా సునీల్..

టాలీవుడ్ స్టార్ నటుడు కమెడియన్ సునీల్.. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌క‌ తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి మధ్యన బాండింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక వీరిద్దరు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టక ముందు నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలని హైదరాబాద్‌లో ఎంట్రీ ఇచ్చిన టైం లో ఇద్దరు ఒకే రూమ్‌లో కలిసి ఉండేవాళ్లం. అయితే అలాంటి టైం లో వీరిద్దరికి కనీసం రూమ్ రెంట్ కట్టే పరిస్థితి కూడా ఉండేది కాదట. అలా ఓ సందర్భంలో రూమ్ రెంట్ కట్టలేక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందని.. చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితులు కూడా చూశామ‌ని ఇటీవల సునీల్ స్వయంగా ఓ ఈవెంట్‌లో వెల్లడించాడు.

Sunil Charges Shocking Remuneration

సునీల్ మాట్లాడుతూ త్రివిక్రమ్ నేను ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉండే టైంలో.. హౌస్ రెంట్ కట్టడానికి కూడా డ‌బ్బు లేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమన్నారు. తెల్లారేసరికి రూమ్ ఖాళీ చేయాలి. ఆ టైంలో నా దగ్గర పాత బట్టలన్నీ వెతికితే 12 రూపాయలు దొరికాయి. లగేజ్ పట్టుకొని బస్ స్టాప్ కి వెళ్ళాం. రాత్రి 9 గంటలు అయింది. ఆ టైంలో నేనేమీ టెన్షన్ పడలేదు. ఎందుకంటే మా దగ్గర తినడానికి సరిపడా డబ్బులు ఉన్నాయని నమ్మకం. అప్పట్లో దిల్ ప‌సంద్‌ మూడు రూపాయలు ఉండేది. రాత్రికి ఇద్దరం చెరొక‌టి తిని ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లి పడుకుంటే తెల్లారాక మళ్ళీ టిఫిన్ చేయడానికి కూడా సరిపడా డబ్బు ఉన్నాయి. అప్పట్లో ప్లేట్ ఇడ్లీ కూడా మూడు రూపాయలు. అలా ప్లాన్ చేసుకొని త్రివిక్రమ్ కి చెప్పా. పర్లేదు నా దగ్గర 12 రూపాయలు ఉన్నాయి రేపు పొద్దున్నే వరకు మేనేజ్ చేద్దామని వివ‌రించా. వెంటనే 12 రూపాయలు ఒకసారి ఇవ్వమని అడిగాడని.. అవి తీసుకుని ఎదురుగా ఉన్న ఒక షాప్ కు వెళ్లి కోకోకోలా టిన్‌ తీసుకువచ్చాడని.. నేను ఇచ్చిన 12 రూపాయలు పెట్టి తీసుకొచ్చేశాడు.

Is Trivikram planning to do a film with Sunil

నువ్వు కొంచెం తాగి.. నాకు కొంచెం ఇవ్వు అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగానే షాక్ అయ్యా. అప్పుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. నువ్వు రేపటి కోసం ఆలోచిస్తున్నావ్ అంటే మన ఆలోచన రేపటి వరకు ఆగిపోతుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులేవు. ఇక ఇప్పటినుంచి రేపు డ‌బ్బులెలా సంపాదించాలో ఆలోచించు.. అన్నాడని సునీల్ చెప్పుకొచ్చాడు. గతంలో జరిగిన ఈ సంఘటనను ఇటీవల ఇంటర్వ్యూలో మరోసారి గుర్తు చేసుకున్నాడు సునీల్. అయితే ప్రస్తుతం సునీల్ స్టార్ కమెడియన్ గానే కాదు విలన్ పాత్రలో, హీరో పాత్రలోను నటించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ కీలకపాత్రలో నటిస్తూ దూసుకుపోతున్న వరుస సినిమా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇక రచయితగా కెరీర్‌ ప్రారంభించిన త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా.. మాటల మాంత్రికుడు ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.