టాలీవుడ్ స్టార్ నటుడు ఇందుకూరి సునీల్ వర్మ అలియాస్.. సునీల్ ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్ లక్షలాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన.. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మొదట డ్యాన్సర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట సునీల్. ఇక స్టార్ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులన సంగతి అందరికీ తెలుసు. త్రివిక్రమ్ సలహాతోనే హాస్యనటుడిగా ప్రయత్నించాడట. ఇక కమెడియన్గా సునీల్ సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. చాలా సినిమాలు సునీల్ కామెడీ వల్లే సక్సెస్ అందుకున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
కేవలం నటుడిగానే కాదు హీరోగా, మంచి డ్యాన్సర్ గాను తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. అందాల రాముడు సినిమాతో మొదట హీరోగా పరిచయమైన సునీల్.. తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మర్యాద రామన్న సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో సునీల్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు, తడాఖా, భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, జక్కన్న, ఈడు గోల్డ్ ఎహే, ఉంగరాల రాంబాబు.. ఇలా వరుస సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు. కానీ.. కమెడియన్ గా వచ్చినంత సక్సెస్ హీరోగా సునీల్‌కు దక్కలేదు.
దీంతో ఇప్పుడు తిరిగి మళ్ళీ కమెడియన్గా రాణిస్తున్నాడు. అయితే ఓ పక్కన హీరోగా, మరో పక్క కమెడియన్ గానే కాదు.. తాజాగా విలన్ గాను ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రలు ప్రేక్షకులను మెప్పించాడు సునీల్. ఇక సునీల్ పర్సనల్ లైఫ్ గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. ఆయన భార్య పిల్లలు ఫ్యామిలీ గురించి అసలు బయటకు ఇన్ఫర్మేషన్ ఉండదు. కాగా సునీల్ ది పెద్దలు కుదిరిచిన పెళ్లి. ఆయన భార్య పేరు శృతి. ఆమె పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందట. వీరిద్దరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.