‘ దేవర ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చెక్.. పర్మిషన్లు రాకపోవడానికి కారణం అదేనా..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు మరికొద్ది రోజులే గ్యాప్ ఉండడంతో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు టీం. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో అరేంజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ క్ర‌మంలో ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచారు మేక‌ర్స్‌.

ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత తారక్ నుంచి ఒక సోలోగా ఆడియన్స్ ముందుకు తార‌క్ వస్తుండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక రిలీజ్ కు కొద్ది రోజుల గ్యాప్ ఉండడంతో మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. రోజుకో అప్డేట్ ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట తెగ చక్కర్లు కొడుతుంది. గత కొద్ది రోజులుగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో ఫ్యాన్స్ అందరి మధ్యన గ్రాండ్ లెవెల్లో మేకర్స్ అరేంజ్ చేస్తున్నారంటూ.. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇక అధికారక ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. ఇప్పుడు ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అక్కడే కాదు అసలు అవుట్ డోర్‌లోనే ఈవెంట్ జరగదని సమాచారం. అయితే ఈవెంట్‌కు ప‌ర్మిష‌న్స్ రాక‌పోవ‌డానికి.. క్యాన్సిల్ అవ్వడానికి కారణం అభిమానులు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తారక్ కి ఉన్న లక్షలాదిమంది అభిమానులు ఈవెంట్ కి రావాలని ఆరాటపడుతూ ఉంటారు. పైగా దేవరకు ఆ తాకిడి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ క్రౌడ్ ను పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడితే.. కొత్త సమస్యలు తలెత్తుతాయని భావించిన మేకర్స్ లిమిటెడ్ ఫ్యాన్స్‌తో హైదరాబాద్‌ నోవాటెల్ లో సింపుల్‌గా ఈవెంట్‌ను చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే దీనిపై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.