ఈ పై ఫోటోలో సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ పక్కన ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా.. ఎంతమంది స్టార్ హీరోలతో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బుడ్డోడు.. ఏకంగా 40 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. ఇతనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రేమ కథ సినిమాలతో కామెడీ సినిమాలతో యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ కుర్రాడు.. గతంలో కంటే ప్రస్తుతం సినిమాలను తగ్గించేశాడు. ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తున్న ఈ హ్యాండ్సం హీరో సినిమాలోనే కాదు.. పలు టీవీ షోలోను సందడి చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.
ఇక బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన బిగ్ బాస్ లోను ఈ హీరో సందడి చేసి ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఇతనెవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఆయన ఎవరో కాదు చంటిగాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలాదిత్య. రాజేంద్రప్రసాద్ నటించిన ఎదురింటి మొగుడు.. పక్కింటి పెళ్ళాం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాలోనే తన క్యూట్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత రౌడీ గారి పెళ్ళాం, అత్తింట్లో అద్దె మొగుడు, జంబలకడిపంబ, బంగారు బుల్లోడు, అబ్బాయిగారు, ఏవండీ ఆవిడ వచ్చింది, హలో బ్రదర్, అన్న తీర్పు, సూపర్ పోలీస్ ఇలా ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.
తర్వాత 2003లో చంటిగాడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సుందరానికి తొందరెక్కువ, రూమ్ మేట్స్, వేట, జాజిమల్లి, 1940లో గ్రామం ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక వెండితెర పైనే కాదు బిగ్ బాస్ సీజన్ 6 లోను కంటిస్టెంట్గా వ్యవహరించి ఆడియన్స్‌ను మెప్పించిన ఈ హ్యాండ్సం హీరో.. చివరిగా మా ఊరి పొలిమేర 2 సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం కొన్ని టీవీ షోలలోను హోస్ట్‌గా వ్యవహరిస్తూ పలు సీరియల్స్ లోను ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్.