కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలి ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. రోజురోజుకీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ తోపాటు టీమ్ అంతా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. దేవర సినిమాలో బైరా పాత్ర ఎంతో ఇంపార్టెంట్ అని.. ఈ పాత్రకు సైఫ్ అలీఖాన్ మాత్రమే న్యాయం చేయగలడని చెప్పుకొచ్చాడు. ఓంకార్ సినిమాలో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.
సైఫ్ టాలెంట్ ను ఇప్పటివరకు ఎవరు సరిగ్గా ఉపయోగించుకోలేదని నా ఒపీనియన్ అంటూ వివరించాడు. ఈ క్రమంలో తారక్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా సందడి చేశాడు. ఇకపోతే ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం.. దాదాపు తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు గడిచిన క్రమంలో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో వేరే లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తారక అభిమానులతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులంతా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.