‘టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా రావడానికి ముందు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గ్యాప్ తీసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే 2018 నుంచి 2024 మధ్యలో ఎన్టీఆర్ అరవింద సమేత – త్రిబుల్ ఆర్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆకలితో అలమటించిపోతున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభమైన దేవర సినిమా రెండు పార్టులుగా వస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్ – మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా డిస్ట్రిబ్యూషన్ అమ్మకాలు జరుగుతున్నాయి. తాజాగా యూఎస్ మార్కెట్లో దేవర సాలిడ్ బిజినెస్ క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకి అక్కడ మొత్తం రు. 27 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో దేవర హిట్ అవ్వాలంటే కనీసం 5 మిలియన్ డాలర్లకు పైగానే వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అయితే యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సైఫాలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రం నేపథ్యంలో సాగే కథ ఆధారంగా దేవర తెరకెక్కుతోంది.