కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విక్రమ్.. తాజాగా పా.రంజిత్ డైరెక్షన్లో తంగలాన్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే విక్రమ్.. కథలో కంటెంట్ ఉందనిపిస్తే.. ఎలాంటి పాత్రలో నటించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. కొంతమంది హీరోలు అన్ని పాత్రలు నటించేందుకు తడబడతారు. అయితే విక్రమ్ మాత్రం అది ఎలాంటి పాత్ర అయినా ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
అలా తాజాగా డి గ్లామర్ రోల్ లో ఎప్పుడు చూడని విధంగా వైవిద్యమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించాడు విక్రమ్. ఆగస్టు 15న పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ మూవీ.. మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్స్ తో కుమ్మిపడేసింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందో అఫీషియల్ గా ప్రకటించారు. తంగలాన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.26.44 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టింది.
ఇక కొలర్ గోల్డ్ ఫిల్ల్స్ లో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీలో మాళవిక మోహన్, పార్వతి తిరువోతూ, పశుపతి, డేనియల్ కొల్జాగిరోన్, సంపత్ రామ్, హరికృష్ణ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాను నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియో సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.