టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆకాశమే హద్దుగా సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. రోజురోజుకు ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ అంచనాలన్నింటినీ దేవరతో అందుకోవాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌కు ఎంతైనా ఉంది. అయితే దేవర పక్కా ఇండస్ట్రీ హిట్ అంటూ ఇప్పటికే అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మాస్, క్లాస్ అని తేడాలు లేకుండా అన్ని వర్గాల ఫ్యాన్స్ కు నచ్చేలా దేవర అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతుందని కొరటాల శివ ఈ విషయాల్లో మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టాక్.
కొరటాల డైరెక్షన్లో వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. అయితే తారక్ ఈ సినిమాకు భారీ లెవెల్ లో లాభాలు సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సరిపోదా శనివారం సినిమా రిలీజ్‌తో ఆగస్టు నెల పూర్తయిపోతుంది. సెప్టెంబర్ నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా. మిగతా చిన్నా సినిమాలు ఏవి.. దేవరపై పోటీకి రావు. దీంతో ఆడియన్స్ అందరి ఫోకస్ దేవర పైనే ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన దేవర వాయిదా పడడంతో.. సెప్టెంబర్ 27కు డేట్ మారింది. అయితే ఈ సినిమా ఇప్పుడు చర్చినియాంశంగా మారింది. కొరటాల శివ డైరెక్షన్లో హీరోగా వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే మంచి హైప్ నెలకొంది.
ఇక కొరటాల చివరగా రూపొందించిన ఆచార్య కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో దేవరపై వస్తున్న హైప్ నెగిటివ్ కాకూడదంటూ అభిమానులు భావిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరుగుతున్న కొద్ది దాని సక్సెస్.. దర్శక, నిర్మాతలకు కత్తి మీద సాముల అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు భారీ అంచనాలతో సినిమాకు వెళ్ళినప్పుడు కాస్త అంచనాలు తప్పినట్లు అనిపించినా మొదటి షో తోనే నెగటివ్ టాక్ వస్తుంది. ఈ క్రమంలో సినిమాకు విపరీతంగా ఎఫెక్ట్ అయి సినిమా ఫ్లాప్ గా నిలిచే అవకాశం ఉంది. దీంతో సినిమాపై ఇప్పటివరకు వచ్చిన విపరీతమైన హైప్ మేకర్స్ తగ్గించే సినిమాను రిలీజ్ చేస్తే మంచిది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన నాని సరిపోదా శనివారం ఇటీవల బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కంటెంట్ ఉంటే దేవర కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఇక ప్రస్తుతం దేవర టీం కూడా సరిపోదా శనివారం టీం స్ట్రాటజీ ఫాలో అయ్యి.. తక్కువ ప్రమోషన్స్ చేసుకుంటే మంచిదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక రిలీజ్ కానున్న దేవర రిజల్ట్ ప్రభావం.. ప్రశాంత్ నీలికాంబోలో తారక్ సినిమా, అలాగే బాలీవుడ్ వార్ 2 సినిమాలపై కూడా పడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో దేవర రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకోబోతుందో వేచి చూడాలి.