ఎలాంటి పాత్రలోనైనా కథ కంటెంట్‌కు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయి నటించే నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. తండ్రి నందమూరి తారక రామారావు నటవరసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఫిలిమ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదిగాడు. ఆరుపదల వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నాడు. ఇక తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోనూ అడుగు వేసి తనదైన ముద్ర వేసుకున్నాడు బాలయ్య. అయితే తాజాగా బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలయ్యి 57 పూర్తయిన క్రమంలో ఆయన మొదటి సినిమా తాతమ్మకల కు సంబంధించిన కొన్ని విషయాలు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. మొదటి సినిమా తాతమ్మకల 1974 ఆగస్టు 30న రిలీజ్ అయింది. బాలయ్య తన 14 ఏళ్ల వయసులో ఈ తాతమ్మ కాల సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
నందమూరి తారక రామారావు స్వయం డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అప్పటి ప్రభుత్వ ఆలోచన ధోరణికి భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అప్పట్లో తాతమ్మకల సినిమాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. రెండు నెలల పాటు సినిమా ఆగిపోయి మరోసారి రిలీజ్ అయింది. 1974లో ఈ సినిమా మొదలయ్యే సమయానికి కుటుంబ నియంత్రణపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇద్దరు ముద్దు.. ఆపై వద్దు.. అని గవర్నమెంట్ కొటేషన్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఈ సినిమాను రూపొందించారు. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ పరిమిత సంతానానికి వ్యతిరేక ధోరణిలో ఉండేవారు. సంతానం ఎంతమంది ఉండాలనేది తల్లిదండ్రుల ఇష్టం. ఇంకెవరికి ఆ హక్కు ఉండదు. అనేది ఆయన వాదన.
అందుకే ఈ అంశాన్ని ఆధారంగా ఎన్టీఆర్ ఓ కథని స్వయంగా రాసుకొని రచయిత డి.వి. నరసరాజు సహాయంతో శక్తివంత సంభాషణగా మార్చి ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కించారు. అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో నటించారు. కథలో మనవడి పాత్రకు పుట్టిన ఐదుగురు పిల్లలు సామాజికంగా రోజు చూస్తున్న ఐదు ప్రధాన సమస్యలపై పోరాడుతూ పరిష్కార ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీటిలో తాతమ్మకల నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలకృష్ణ మెప్పించారు. వ్యసనపరుడిగా హరికృష్ణ కనిపించాడు. సినిమాలో రాజబాబు, రమణారెడ్డి, రోజారమణి, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషించగా.. చిత్రీకరణను వేగంగా పూర్తి పూర్తి చేసుకున్న ఆయన అప్పటి పరిస్థితులు, గవర్నమెంట్ నిబంధనల కారణంగా సెన్సార్ అడ్డంకులు బాగా ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా పై రెండు నెలల పాటు నిషేధం విధించారు. అసెంబ్లీలో కూడా దీనిపై చర్చలు జరిగినట్లు ఎన్టీఆర్ అప్పట్లో గొప్పగా వెల్లడించారు. ఎన్టీఆర్ చివరకు తన పట్టుదలను నెరవేర్చుకున్నారు. ఆ అడ్డంకులన్నీ దాటి తిరిగి ఆగస్టు 30న ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఉత్తమ కథ రచయితగా ఎన్టీఆర్‌కు నంది అవార్డు కూడా దక్కింది.