అక్కడ మూడు సినిమాలతో రూ. 203 కోట్లు.. ఇది ప్రభాస్ రాజు రేంజ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో కోట్ల కలెక్షన్లు కల్లగొడుతూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరి మూడు సినిమాలతో నైజాం ఏరియాలో ప్రభాస్ భారీ కలెక్షన్లను కల్లగొట్టి రికార్డ్ సృష్టించాడు. మరి ప్రభాస్ హీరోగా నటించిన చివరి మూడు సినిమాలకు నైజం ఏరియాలో ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. కొద్దికాలం క్రితం ప్రభాస్ హీరోగా ఆది పురుష్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఓమ్ రౌత్‌ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమాలో కృతిస‌న‌న్‌ హీరోయిన్గా నటించింది. అయితే మొదట భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

Adipurush Full Movie in Hindi | Prabhas | Saif AK, Kriti S, Sunny S -  YouTube

అయినా సినిమాకు నైజం ఏరియాలో మాత్రం భారీ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు నైజం ఏరియాలో రూ.39.20 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి. ఓ డిజాస్టర్‌ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్స్ అంటే అది సాధారణ విషయం కాదు. ఇక పోతే ప్రభాస్ నుంచి గతేడాది డిసెంబర్ నెలలో వచ్చిన సలార్ సినిమా.. ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో మెప్పించాడు. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లు తెర‌కెక్కిన ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఏకంగా రూ.71.40 కోట్ల రేంజ్ లో షేర్ వ‌శూళ్ళు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసింది. ఇందులో దిశాపటాని హీరోయిన్గా నటించగా.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించాడు.

Salaar 6 Days Collections: మరో రికార్డు కొట్టిన సలార్.. 500 కోట్లతో  సంచలనం.. అక్కడ టార్గెట్ ఫినీష్ | Prabhas Starrer Salaar Movie 6 Days  Worldwide Box Office Collections - Telugu Filmibeat

ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ రన్ ముగ్గిసేశ‌రికి నైజం ఏరియాలో రూ.92.80 కోట్ల రేంజ్ లో షేర్‌వ‌సూళ్ళ‌ను దక్కించుకుంది. ఇలా ప్రభాస్ హీరోగా నటించిన చివరి మూడు సినిమాలు నైజాం ఏరియాలో ఏకంగా రూ.203.40 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించాయి. ఇలా ప్రభాస్ చివరి మూడు సినిమాలు తో నైజాం ఏరియాలో తన సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ విషయం నెటింట‌ వైరల్‌గా మారడంతో ప్రభాస్ అభిమానులంతా తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ప్రభాస్ రాజు రేంజ్ అంటూ ప్రభాస్ స్టామినా ప్రూవ్ అయింది అంటూ.. తమ అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.

కల్కి 2898AD' మూవీ రివ్యూ: గేమ్ ఛేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా... | Times Now  Telugu