ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో నాని సినిమాలైనప్ భారీగా పెరిగింది. గతేడాది హయ్‌నాన్నతో నాని సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వైవిధ్యమైన కథలను చూజ్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని.. గతంలో సాహో ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ కాకముందే సందిగ్ధతలో పడింది. ఇక ఈ సినిమా విషయంలో నాని ఏం డెసిషన్ తీసుకుంటాడో.. వేచి చూడాలి.
ఇదిలా ఉంటే మాస్, క్లాస్ టచ్ ఏదైనా కూడా తనదైన స్టైల్ లో పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ.. అందరికీ ఫేవరెట్ స్టార్ అయిపోయాడు నాని. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నాని ఇమేజ్ పెరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే నాని రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ పోతున్నాడు. వరుస సక్సెస్‌లు అందుకుంటూ టైర్2 హీరోల జాబితాలోకి వచ్చేసిన నాని.. 2017 లో చేసిన నేను లోకల్ తో ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ను అందుకున్నాడు. కరోనా టైం లో రూ.15 కోట్ల ఉన్న నాని రేమ్యునరేషన్ ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.10 కోట్లు పెరిగి రూ.25 కోట్లకు చేరుకుంది. అతని మార్కెట్ వ్యాల్యూ కూడా 40 నుంచి 60 కోట్ల వరకు చేరుకోవడం విశేషం.
ఈ లెక్కల ప్రకారం నాని హైయెస్ట్ రెమ్యూనరేషన్ ని అందుకుంటున్న టైర్2 హీరోగా రికార్డ్ సృష్టించాడు. సరిపోదా శనివారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన క్రమంలో.. నెక్స్ట్ ప్రాజెక్టుకు రెమ్యునరేషన్ మరింతగా నాని పెంచబోతున్నట్లు సమాచారం. తన నెక్స్ట్ సినిమా కోసం నాని రూ.27 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. ఇక 2008 అష్టా చమ్మా సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఈయన బ్రేక్ లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందకపోయినా.. 2017లో వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి నాని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్‌లో దూసుకుపోతున్నాడు.