టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తారక్ రిజెక్ట్ చేసిన కథలలో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో మరో హీరో నటించడం వల్ల వారు స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
అయితే తారక్ ఇప్పటివరకు తన సినీ కెరీర్లో ఒక్కసారి కూడా సాఫ్ట్ రోల్‌ను ఎంచుకోలేదు. మాస్, యాక్షన్ కచ్చితంగా తన సినిమాల్లో ఉండేలా చూసుకునే తారక్ ఓ సాఫ్ట్.. హార్ట్ టచింగ్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చినా.. ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. అది కూడా మల్టీ స్టారర్ సినిమా కావడం విశేషం. ఆ మూవీ మరేదో కాదు ఊపిరి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నాగార్జున కార్తీ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా.. కార్తి పాత్రకు మొదట వంశీ పైడిపల్లి.. ఎన్టీఆర్‌ను భావించారట. అయితే అప్పటికే తారక్‌కు.. వంశీ పైడిపల్లి బృందావనం లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. మరోవైపు నాగార్జునకు.. తారక్ ఎంతో సన్నిహితుడైన సంగతి తెలిసిందే. నాగార్జున.. ఎన్టీఆర్ ను తన పెద్ద కొడుకుగా భావిస్తూ ఉంటారు. హరికృష్ణను తన సొంత అన్నయ్యగా ఫీల్ అవుతారు.
అలాంటి నాగార్జున, వంశీ పైడిపల్లి ఇద్దరు తారక్‌కు ఎంత కావాల్సిన వాళ్లు అయినా.. ఊపిరి సినిమా క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్‌కు నచ్చిన ఈ సినిమాలో నాగార్జున కాళ్ళకు సాక్స్‌లు తొడిగే సీన్స్ ఉంటాయని.. ఈ సన్నివేశాల్లో ఎన్టీఆర్.. నాగార్జున కాళ్ళ దగ్గర కూర్చొని సాక్సులు తొడగడం అనేది ఫ్యాన్స్ అంగీకరిస్తారో.. లేదో.. అనే సందేహంతో ఎన్టీఆర్ ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట. ఇలా ఈ మూవీ కార్తి చేతిలోకి వెళ్లడం.. కార్తీ ఈ సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకోవడం జరిగింది. ఒకవేళ ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించి ఉంటే.. ఇది కచ్చితంగా తారక్ కెరీర్లోనే మెమొరబుల్ సినిమాగా ఉండిపోయేది అనడంలో అతిశయోక్తి లేదు.