అక్కినేని నాగేశ్వరరావు నటవారుసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించాడు. అలా అక్కినేని సినిమాలో మొదటి నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులు మెప్పించాడు. ప్రస్తుతం నవమన్మధుడుగా స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న నాగ్.. సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అదే ఫిట్నెస్, అందంతో.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాగార్జున తన సినీ కెరీర్‌లో తండ్రి ఏఎన్ఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అలా ఏఎన్ఆర్, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమాల లిస్ట్ ఒకసారి తెలుసుకుందాం.
సుడిగుండాలు
మొదటి నాగార్జున అక్కినేని నాగేశ్వరావు హీరోగా తెరకెక్కిన సుడిగుండాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. చిన్న అతిథి పాత్రలో తళ్ళుక్కున మెరిసి మాయమవుతాడు నాగ్. అయితే నాగార్జున ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన తర్వాత తన తండ్రితో కలిసి నటించిన మొట్టమొదటి సినిమా మాత్రం కలెక్టర్ గారి అబ్బాయి. బి. గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
అగ్నిపుత్రుడు
కె. రాఘవేంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన అగ్నిపుత్రుడు సినిమాలో కూడా నాగార్జున, ఏఎన్ఆర్‌తో కలిసి నటించారు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
రావుగారిల్లు
ఈ సినిమా తర్వాత నాగార్జున, ఏఎన్ఆర్ కలిసి నటించిన మూవీ రావుగారిల్లు. తరుణి రావ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌తో పాటు.. ఎస్.ఎస్. క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
ఇద్దరు ఇద్దరే
ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఇద్దరు ఇద్దరే సినిమాలోని కూడా నాగార్జున, నాగేశ్వరరావు కలిసి నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఊహించిన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది.
శ్రీరామదాసు
మరోసారి కే.రాఘవేంద్ర డైరెక్షన్‌లో ఏఎన్ఆర, నాగార్జున కలిసి నటించిన మూవీ శ్రీరామదాసు. ఈ సినిమాలో ఏఎన్ఆర్ చిన్న గెస్ట్ రోల్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది.
మనం
ఇక చివరిగా ఏఎన్ఆర్ నటించిన మూవీ మనం లో కూడా కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్య, అఖిల్ తో కలిసిన నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. ప్రేక్షకుల్లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది.