విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ ప్రాజెక్టుల లిస్ట్‌… మైండ్ బ్లోయింగ్ రా బాబు..?

టాలీవుడ్ యంగ్ హీరో … క్రేజీ హీరో … రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర యువత ఎలా పోటెత్తుతారో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నటిస్తున్న VD 12 వ సినిమాపై భారీ ఆశలు.. అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలు వ‌రుస పెట్టి ప్లాప్ అవుతున్న కూడా అతని క్రేజ్‌ ఏమాత్రం తగ్గటం లేదు. విజయ్ దేవరకొండ కెరియర్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఇక అంతకుముందు సమంతతో కలిసి విజయ్ దేవరకొండ చేసిన ఖుషి సినిమా కూడా యావరేజ్ గానే ఆడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలు అన్ని గౌతం తిన్న‌నూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ VD 14 వ సినిమాను రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నాడు. పీరియాడికల్ జాన‌ర్‌లో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉండబోతుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమా త‌ర్వాత‌ రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. పుష్ప 2 త‌ర్వాత సుకుమార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇక యానిమ‌ల్ సినిమా ద‌ర్శ‌కుడు మ‌రోసారి విజ‌య్‌తోనే అర్జున్ రెడ్డి + యానిమ‌ల్ రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇది మూడేళ్ల త‌ర్వాతే ఉంటుంది. ఏదేమైనా విజ‌య్ దేవ‌ర‌కొండ స్ట్రాంగ్ లైన‌ప్ అయితే మామూలుగా లేద‌నే చెప్పాలి.