పెళ్ళికి ముందే లివింగ్ రిలేష‌న్‌లో ఉంటున్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్స్ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి రంగుల ప్రపంచంలో ప్రతి ఏడాది ఎంతోమంది నటీ.నటులు.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని.. స్టార్ సెలెబ్రెటీలుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో అక్కడ ఇండస్ట్రీ అలవాట్లనే ఫాలో అవుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక‌ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే.. లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా లివింగ్ రిలేషన్ షిప్ ట్రెండును కేవలం టాలీవుడ్ హీరో, హీరోయిన్లే కాదు.. తెలుగు బుల్లితెరపై నటించే హీరోయిన్స్ కూడా ఎంతోమంది ఫాలో అవుతున్నారు. అలా తెలుగు బుల్లితెరపై పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న హీరోయిన్ల లిస్ట్ ఒకసారి చూద్దాం.

Priyanka Jain : జుట్టు పెరిగాక పెళ్లి చేసుకుంటాను.. పెళ్లిపై ఆసక్తికర  అప్డేట్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ.. | Bigg boss fame priyanka jain gives clarity  about her marriage with shiva kumar ...

ప్రియాంక జైన్ – శివకుమార్:
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది ప్రియాంక జైన్.. మొదట మౌనరాగం సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. ఈ అమ్మడు ఈ సీరియల్లో కోస్టార్ గా, హీరోగా నటించిన శివకుమార్‌తో ప్రేమాయణం నడుపుతుంది. అయితే వీరిద్దరూ ప్రస్తుతం లివింగ్‌ రిలేషన్‌షిప్ లో ఉన్నారు. పెళ్లి విషయంలో మాత్రం మాట దాటేస్తూ.. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలం గడిపేస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ జంట కొత్త ఇల్లు కట్టుకుని అక్కడకు షిఫ్ట్ అయిపోయారు.

ఘనంగా బుల్లితెర నటి కీర్తి భట్ నిశ్చితార్థం... ఫోటోలు వైరల్

కీర్తి భట్ – కార్తీక్ తోట:
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న కీర్తిభ‌ట్.. బిగ్బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకుని సెలబ్రిటీగా మారిపోయింది. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్తీక్ తోట అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ అమ్మడు.. అత‌నితో వివాహం కాకుండానే లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంటుంది.

డాక్టర్ బాబు తమ్ముడి ప్రేమలో మోనిత... బయట పడిన అసలు విషయం

శోభా శెట్టి – యశ్వంత్:
తెలుగు బుల్లితెర‌ను ఓ ఊపుఊపిన కార్తీకదీపం సీరియల్ లో మౌనిత(శోభా శెట్టి) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ విలన్ గా నటించి ప్రేక్షకులను విలినిజంతో మెప్పించిన శోభ‌శెట్టి.. ఈ సీరియల్‌లో తన కోస్టార్‌గా ఉన్న యశ్వంత్ తో ప్రేమలో పడింది. అయితే ఎంతోకాలంగా వీరిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసి అందులో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు.

Bigg Boss 5 Telugu Contestant Siri To Get Hitched To Shrihan Post Her Exit  From The Show? - Filmibeat

సిరి హనుమంత్ – శ్రీహన్:
మొదట యూట్యూబ్ వెబ్ సిరీస్ ల ద్వారా భారీ పాపులారిటి దక్కించుకున్న సిరి హనుమంత్.. తర్వాత పలు సీరియల్ నటించింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వ్యవహరించి మంచి పాపులారిటి దక్కించుకుంది. అలాగే బిగ్ బాస్ 6 ర‌న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీహాన్‌తో అమ్మడు ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉంటున్నారు. అంతేకాదు వీరిద్దరూ ఓ బాబును దత్తత తీసుకొని సొంత కొడుకులా పెంచుకుంటున్నారు.

Pavan Sidhu Age, Height, Wife, Mother, Family, Movies List, Biography & More

సిద్దు పవన్ – సోనియా సింగ్:
ఈ జంట మొదట పలు వెబ్ సిరీస్ ల ద్వారా పాపులారిటి దక్కించుకున్నారు. తర్వాత టీవీ షోలో వైరల్ కావడంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సోనియాసింగ్ విరూపాక్ష మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇక యూట్యూబ్ సీరియస్‌లు చేస్తున్న‌ సమయంలో ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలు పడ్డారు. అప్పటి నుంచి ఈ జంట లివింగ్‌ రిలేషన్ లోనే ఉంటున్నారు. తాజాగా వీరు ఈటీవీ విన్‌లో రొమాంటిక్ కామెడీ సిరీస్‌ శశి మదనం ద్వారా ప్రేక్షకులను పలకరించారు.