ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎప్పటికప్పుడు ఎంతో మందిని నటిమణులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉంటారు. అయితే సినిమాల్లో స్టార్‌డం క్రియేట్ చేసుకోవాలంటే.. సినిమాలపై ఇంట్రెస్ట్, టాలెంట్, పట్టుదల మాత్రమే ఉంటే సరిపోదు. హీరోయిన్గా రాణించాలంటే పిసరంతా అదృష్టం కూడా కలిసి రావాలన్న సంగతి తెలిసిందే. అలా ఎంత టాలెంట్ ఉన్నా అప్పుడప్పుడు సినీ కెరీర్‌లో అప్ అండ్ డౌన్.. కామన్‌గానే ఉంటాయి. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది మొదట స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన‌ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీ నుంచి దూరమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా పాత్ర ఏదైనా తమ టాలెంట్ తో రాణిస్తున్న వారు ఉన్నారు. కెరీర్‌లో హిట్ ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి రాణిస్తున్న హీరోయిన్లలో పై ఫోటోలో చూస్తున్న చిన్నారి పెళ్లికూతురు కూడా ఒకటి.

Anjali : అంజలి అల్ట్రా స్టైలిష్ ఫొటోస్-Namasthe Telangana

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈమె అందం, అభినయానికి ఎంతోమంది ఫిదా అవుతుంటారు. పెరుకు టాలీవుడ్ హీరోయిన్ అయినా తమిళ్‌లోను మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు అక్కడ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మన తెలుగు అమ్మాయి అంజలి. తూర్పుగోదావరి జిల్లా.. మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన అమ్మాయి కావడం విశేషం. అయితే ఈమె తల్లిదండ్రులు ఉపాధి రిత్య వేరే దేశంలో చదువుకుంది. తన 10వ‌ తరగతి పూర్తయిన తర్వాత అంజలి చెన్నైకు మక్కాం మార్చి అక్కడే డిగ్రీ చదువును పూర్తి చేసింది.

అయితే నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో డిగ్రీ చదువుతూనే మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. మొదటి తమిళ్‌లో డేర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక‌ 2006లో ఫోటో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ప్రేమలేఖ రాశా సినిమాతోనూ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. తన అందం, అభినయంతో నటనకు మంచి మార్కులు పడ్డా సరైన గుర్తింపు రాకపోవడంతో.. కోలీవుడ్కు మక్కాం మార్చేసిన అంజలి.. అక్కడ వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. మళ్లీ చాలా కాలం గ్యాప్ తర్వాత 2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అటు తమిళ్ ఇటు తెలుగులోను ఆఫర్లు క్యూ కట్టాయి.Vakeel Saab actress Anjali signs F3

తెలుగులో బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, సరైనోడు.. ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ క్రేజీ బ్యూటీ.. మధ్యలో టాలీవుడ్ ఆఫర్లు తగ్గిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మరోసారి త్రో బ్యాక్ అయింది. ఈ క్రమంలో మాచర్ల నియోజకవర్గం, గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి ఇలా వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతే కాదు రామ్ చరణ్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజ‌ర్‌ సినిమాలోను ఓ కీలక పాత్రలో నటిస్తుంది అంజలి. అయితే ప్రస్తుతం ఈ అమ్మ‌డి చిన్ననాటి ఫొటోస్ వైర‌ల్ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పుడు కూడా అంజలి మహా అందంగా ఉందే అంటూ.. సో క్యూట్ అంటూ.. తన చిన్ననాటి ఫొటోస్ ను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.