అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా.. ఇక ఫ్యాన్స్ కు పండగే.. !

ప్ర‌స్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ఏకైక వార్త నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య.. మరువైపు కెరీర్ పరంగాను ఓ మెట్టు ఎదిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన సినిమా అంటే మజిలీ. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ కోసం చైతు అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. అయితే ప్రస్తుతం చైతు తండేల్‌ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కొట్టాలనే క‌సితో ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే విరూపాక్ష లాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండుతో నాగచైతన్య మరో ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కార్తీక్ దండు డైరెక్షన్‌లో హారర్ థ్రిల‌ర్‌గా తెర‌కెక్కిన విరూపాక్ష అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు అదే డైరెక్టర్‌తో నాగచైతన్య ఓ ప్రాజెక్టును తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడట. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బాస్టర్ కొట్టాలని స్క్రిప్ట్ ను కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కార్తీకదీపం మరోసారి థ్రిల‌ర్‌ టచ్ ఉన్న‌ సబ్జెక్టుతోనే చైతును ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడ‌ట‌.

Naga Chaitanya Teaming With Karthik Dandu | cinejosh.com

విరూపాక్షకు ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్‌. ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. ఇక తాజాగా నాగచైతన్య – శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం, మరోవైపు కెరియర్ లోనే బిగ్ బడ్జెట్ ఫిలిం అది కూడా కార్తీక్ దండు లాంటి డైరెక్టర్ తో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇకపై సరికొత్త నాగచైతన్యను చూడబోతున్నాం అంటూ.. ఎకేసారి చైతూ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, కెరీర్ విష‌యంలో శుభ‌వార్త‌లు విన‌డం చాలా సంతోషంగా ఉందంటూ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.