తరుణ్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వే కావాలి ‘ వదులుకున్న ఆ అన్ లక్కీ ఫెలో .. దరిద్రమంటే ఇదేగా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తరుణ్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరుణ్ సినీ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ సినిమాల‌లో నువ్వే కావాలి మూవీ ఒక‌టి. ఈ సినిమా తరుణ్ కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయింది. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రీచా హీరోయిన్గా నటించింది. కథ ప‌తంగాను, సంగీత పరంగాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు కోటి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ కథను మొదట ఓ హీరో రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అన్ ల‌క్కి ఫెలో ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

Nuvve Kavali (2000) - IMDb

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో సుమంత్ కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో.. సత్యం , గౌరీ, గోదావరి, గోల్కొండ హై స్కూల్ లాంటి సినిమాలతో తనదైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ఉండే సుమంత్.. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మీ సినిమాల‌కు గ్యాప్ ఎందుకు వస్తుందని ప్రశ్నకు తాజాగా రియాక్ట్ అయ్యాడు సుమంత్. స్క్రిప్ట్ బాగా నచ్చితే సినిమా ఒప్పుకుంటానని.. అందుకే నా నుంచి కొత్త సినిమా రావడం కాస్త ఆలస్యం అవుతుంది అంటూ వివరించాడు. అలా మొత్తం సినీ కెరీర్‌లో తన వద్దకు వచ్చిన.. చేయలేకపోయినా సినిమా నువ్వే కావాలి అంటూ వివరించాడు సుమంత్.

Sumanth - IMDb

కెరీర్‌ ప్రారంభంలో స్రవంతి రవికిషోర్ గారు నాకు నువ్వే కావాలి స్టోరీ ఆఫర్ ఇచ్చారని.. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయాలని కారణంగా క‌థ‌ నచ్చినా సినిమా వ‌దులుకున్న అంటూ వివరించాడు. అప్పుడు నేను.. యువకుడు, పెళ్లి సంబంధం రెండు సినిమాల్లోనూ ఒకేసారి నటిస్తున్నా అందుకే నువ్వే కావాలి మూవీ చేయడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నా సినీ కెరీర్‌లో అవకాశం వచ్చిన చేయలేకపోయినా ఏకైక సినిమా అదొకటేనంటూ సుమన్‌ చెప్పుకొచ్చాడు. కాక ప్రస్తుతం సుమన్ నువ్వే కావాలి సినిమాను మిస్ చేసుకున్నాడంటూ వార్త వైరల్ అవ్వడంతో అభిమనులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా సుమంత్ అన్న ఈ సినిమాను చేయకపోవడం బ్యాడ్ లక్ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.