టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాము తెరకెక్కించే సినిమాకు ముందుగానే టైటిల్ ను సినీ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న చాలా సందర్భాల్లో.. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళకి అది దక్కుతుంది. ఇక్కడ చాంబర్ చాలా స్ట్రీట్ రూల్స్‌ను ఫాలో అవుతుంది. దానికి అనుగుణంగా నిర్మాతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా పెద్ద సినిమా టైటిల్స్ కాస్త క్లాష్ ఏర్పడినప్పుడు మాత్రం.. వీలైనంత వరకు మార్చే అవకాశం దొరకదు. దీంతో చిన్న నిర్మాతలు అనుమతిని తీసుకొని.. టైటిల్ తమ సినిమాకు పెట్టుకునేలా నిర్మాతలు ఒప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
తాజాగా అలాంటి సంఘటన ఒకటి మెగాస్టార్ సినిమా విషయంలో జరిగిందని వార్త వైరల్ అవుతుంది. ఓ చిన్న సినిమా నిర్మాత తమ సినిమా కోసం ఫిక్స్ చేసుకున్న టైటిల్.. చిరంజీవి సినిమా కోసం దానం చేసినట్లు స్వయంగా ఆయనే వివరించాడు. నిర్మాత రాజేంద్రరెడ్డి.. సింబ మూవీతో ఆగస్టు 9న ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రలో నటించారు. పర్యావరణ ప్రాధాన్యత ఆధారంగా వస్తున్న ఈ సినిమాకు.. మొదట గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టాలని భావించారట నిర్మాతలు.
కానీ అదే టైంలో చిరంజీవి సినిమాకు కూడా గాడ్ ఫాదర్ టైటిల్ అనుకోవడం.. చిరంజీవి కాల్ చేసి తమ టైటిల్ను అడిగడంతో రాజేంద్రరెడ్డి తన సినిమాకు అనుకున్న టైటిల్ చిరంజీవి సినిమా కోసం ఇచ్చేసారట. ఈ విషయాన్ని స్వయంగా మూవీ ప్రమోషన్స్ లో రాజేంద్రరెడ్డి చెప్పకొచ్చాడు. మేము ఆ తర్వాత కథకు తగ్గట్టు సింబ అనే టైటిల్ ఫిక్స్ చేసామని వివరించాడు. గాడ్ ఫాదర్ సినిమా మలయాళ హిట్ లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచి అభిమానులను నిరాశపరిచింది.