టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కొంతసేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాక్టర్ నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాతో దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించాలంటూ చాలామంది కమిటీ కుర్రాళ్లు సినిమా టీంకు తమ బెస్ట్ విషెస్ ద్వారా తెలియజేశారు. ఇక గత రెండు వారాలుగా మంచి జోరుగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్ తో సినిమాపై ప్రేక్షకులో కూడా మంచి హైప్ నెలకొంది.
చిరంజీవితో పాటు పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా కోసం తమ వంతుగా పబ్లిసిటీ చేస్తూ సినిమాను ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో సినిమాపై బజ్ పెరిగింది. కానీ.. అనుకోని విధంగా ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా విడుదల అవుతుంది ఆగస్టు 9న కావడంతో అదే రోజున మహేష్ బాబు పుట్టినరోజు కూడా రావడంతో.. మహేష్ బాబు సినిమా మురారి రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజు కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న అభిమానులంతా మురారి సినిమాను తుతూ మంత్రంగా ఒక్క షో ఆడించి వదిలేయకుండా.. కనీసం రెండు, మూడు రోజులపాటు కంటిన్యూస్గా ఆడేలా ప్రయత్నాలు చేస్తున్నారట. రీ రిలీజ్‌కు ఎక్కువ స్క్రీన్స్ మరియు.. ఎక్కువ రోజులు ప్లాన్ చేస్తే కచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్.. రెగ్యులర్ సినీ ప్రేక్షకులు కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమా కంటే మురారి సినిమాను చూసేందుకే ఆసక్తి చూపుతారు.
ఈ క్రమంలో కమిటీ కుర్రాళ్ళు సినిమాకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని..ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి సినిమాకు భారీ ప్రమోషన్ జరిగాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దాదాపు రూ.2.5కోట్ల వసూళ్లు కలగొట్టాయి. ఈ సినిమా రిలీజై వసూళ్లు రికార్డ్‌గా నిలవాలని ఉద్దేశంతో ఫ్యాన్స్ మహేష్ సినిమా బుకింగ్స్ విషయంలో అసలు వెనక్కు తగ్గడం లేదట. అలాగే పిఆర్ టీం కూడా సినిమా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇక కమిటీ కుర్రాళ్ళు సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ కారణంగా సినిమా మంచి ఓపెనింగ్స్ వచ్చేవనటంలో సందేహం లేదు. కానీ ఇదే సమయంలో మురారి సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో కచ్చితంగా కమిటీ కుర్రాళ్ళు సినిమా ఓపెనింగ్స్ కు కాస్త డ్యామేజీ అవుతుందని.. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప మురారిని బీట్ చేసి వసూలు చేసే అవకాశం లేదంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమాకు యదువంశీ దర్శకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి ప్రయత్నంలోనే నిహారికకు మహేష్ బాబు సినిమా రూపంలో చిక్కులు వచ్చి పడ్డాయి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కష్టం నుంచి కమిటీ కుర్రాళ్ళు బయటపడుతుందో.. లేదో.. వేచి చూడాలి.