ఆమె వల్ల నాగచైతన్య – శోభిత విడిపోతారు.. వేణు స్వామి సెన్సేషనల్ పోస్ట్ వైరల్

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవ‌స‌రం లేదు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఎప్పటికప్పుడు నెట్టింట సంచలనంగా మారుతూ ఉండే వేణు స్వామి.. గతంలో సమంత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ టైంలో వీరిద్దరూ విడిపోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. కాగా ఈ జంట పెళ్లి తర్వాత నిజంగానే కొంతకాలానికి డివోర్స్ తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో వేణు స్వామి మాటలు అంత నమ్మడం మెల్లమెల్లగా మొదలుపెట్టారు. కానీ.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడంటూ చిప్పిన వేణు స్వామి తాన జాత‌కం ఫెయిల్ కావ‌డంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎవ‌రు ఊహించ‌ని విధంగా పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలో తను చెప్పిన జాతకం ఫెయిల్ అవ్వడంతో మరోసారి సెల‌బ్రెటీస్ జాతకాలు చెప్పనంటూ వేణు స్వామి అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. 

అప్పటినుంచి సెలబ్రిటీల జాతకాలు జోలికి పోనీ ఈయన.. మళ్ళీ ఆగస్టు 8న జరిగిన నాగచైతన్య – శోభిత నిశ్చితార్థం పై షాకింగ్ పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. వీరిద్దరి జాతక విశ్లేషణ చెప్పబోతున్నట్లుగా పోస్ట్ షేర్ చేసిన వేణు స్వామి.. తాజాగా నాగచైతన్య – శోభిత‌ జాతకాలు చూసి సంచలన వీడియోను ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్నాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం గురించి మాట్లాడుతూ.. వైవాహిక జీవితానికి సంబంధించిన ఏడవ స్థానంలో కలత్ర స్థానం ఉందని దీనివల్ల భార్యాభర్తలకు క‌ల‌తలు ఏర్పడతాయి అంటూ చెప్పుకొచ్చాడు. నాగార్జున ఫిక్స్ చేసింది నిషేధ ముహూర్తం అని.. మరి దానినే వీరు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారంటే ఎనిమిదో నెల, ఎనిమిదో తేదీ, 2024 కాబట్టి ముహూర్తం బలంగా ఉంటుందని వారు భావించి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. నిశ్చితార్థంకు పనికిరాని ముహూర్తంలో చేసుకున్నారు. అయితే సమంతది మేషరాశి, శోభితది ధనుష్ రాశి.. ఆమె కూడా అమావాస్య నాడే జన్మించింది. నాగచైతన్య, స‌మంత పెళ్లి కాకముందే వారిద్దరు విడాకులు తీసుకొని విడిపోతారని చెప్పాడు.

ఇక ఇప్పుడు శోభిత, చైతు జాతకాల విశ్లేషణ చేసి.. నేను అందరూ కలిసి ఉండాలని కోరుకుంటానని.. కానీ శోభిత జాతకం వల్ల 2027 నుంచి వీరి వివాహ బంధంలో కలతలు, సమస్యలు ఏర్పడతాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వీళ్ళ ఇద్దరి వివాదాలకు ఓ స్త్రీ కారణమవుతుందని.. నాగచైతన్య – శోభిత జాతకాలు అసలు కలవడం లేదంటూ నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా మంచిది కాదంటూ వివరించాడు. నేను అఖిల్ విషయంలో ఇలాగే చెప్పా ఇప్పుడు ఒక జ్యోతిష్యుడుగా మంచి కోసం మాట్లాడుతున్నా. నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా. కానీ.. వారి జాతకాలు బాలేదు. నాగచైతన్య, శోభిత కూడా విడిపోతారంటూ చెప్పుకొచ్చాడు. నన్ను మీరు అడగొచ్చు సమంత – నాగచైతన్యకు 50 మార్కులు అయినా వేస్తా.. కానీ శోభితకు మాత్రం 10 మార్కులు కూడా వేయలేనని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే కెరీర్ పరంగా శ్యామ్ జాతకం బాగానే ఉంది. కానీ శోభితది అసలు బాలేదు అంటూ వివరించాడు. వీరిద్దరి మధ్య ఏడబాటు కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వేణు స్వామి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలో నాగచైతన్య ఫ్యాన్స్ అంతా వేణు స్వామి పై ఫైర్ అవుతూ బండబూతులు తిడుతున్నారు.