బన్నీ పై పవన్ షాకింగ్ కామెంట్స్.. పుష్ప 2కు చిక్కులు తప్పనట్టేనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేప‌ట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అయితే గ‌త‌ కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వార్‌ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్ననాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని.. పుష్ప 2కి చిక్కులు తప్పవంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 సినిమా మనుగడ ఉంటుందా.. లేదా.. అనేదానిపై కూడా అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అల్లు అర్జున్ గురించి మాట్లాడిందే లేదు. అయితే తాజాగా బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం మన సినిమాల్లో హీరోలు అడవులు కాపాడేవారు.. అలాంటిది ఇప్పుడు సినిమా ఎలా మారిపోయిందంటే హీరోనే.. అడవుల్లో చెట్లని నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుత సినిమా పరిస్థితి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప‌వ‌న్ ఈ కామెంట్స్‌తో ఎవరిని టార్గెట్ చేశారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ చేయడం నెట్టింట‌ చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని కచ్చితంగా పుష్ప 2ను ఉద్దేశించే మాట్లాడారని నెటిజ‌న్లు చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్న పుష్ప 2 డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పవన్ చేసిన కామెంట్స్ బ‌న్ని అభిమానుల‌కు ఆంధోళ‌న క‌లిగిస్తున్నాయి.