టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఇప్పటి హీరోస్ వరకు ఎంతో మంది త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. అలా తమ సినిమాల్లో ఇప్పటివరకు త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్:
నందమూరి నటసార్వభౌమ తారక రామారావుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమాల హృదయాల్లో దేవుడిగా చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ ఎన్టీఆర్.. కులగౌరవం, దానవీరశూరకర్ణ, శ్రీకృష్ణసత్య, శ్రీమద్ విరాటపర్వం, వీరబ్రహ్మేంద్ర చరిత్రా.. ఇలా ఎన్నో సినిమాల్లో త్రిపాత్రాభినయం అంతకంటే ఎక్కువ పాత్రలోనూ నటించి మెప్పించాడు.
ఏఎన్ఆర్:
అలనాటి స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు.. నవరాత్రి అనే సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అది కూడా విభిన్నమైన పాత్రలో ఎంచుకొని నటించారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
సూపర్ స్టార్ కృష్ణ :
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ.. కుమార రాజా, రక్త బంధం, పగబట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, దొర ఇలా దాదాపు 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు.
శోభన్ బాబు – చిరంజీవి:
టాలీవుడ్ అందగడిగా చెరగని ముద్ర వేసుకున్న శోభన్ బాబు.. ముగ్గురు మొనగాళ్లు సినిమాలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదే సినిమాలో చిరంజీవి కూడా మూడు పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
బాలకృష్ణ :
నందమూరి నరసింహ బాలకృష్ణ ప్రస్తుతం హాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కూడా తన సినీ కెరీర్‌లో ఓ సినిమాకు త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అదినాయకుడు సినిమాల్లో తాతగా, తండ్రిగా, మనవడిగా మూడు పాత్రల్లోను బాలకృష్ణనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ :
నందమూరి నటి వారసుడక తాతకు తగ్గ తనయుడుగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సినీ కెరీర్‌లో జై లవకుశ సినిమాలో నటించి ప్రేక్షకులు మెప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో త్రిపాత్రయాభినయం చేసి ఎన్టీఆర్ మెప్పించాడు. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
కళ్యాణ్ రామ్:
నందమూరి నట వరుసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన హీరోలలో కళ్యాణ్ రామ్ కూడా ఒకడు. కళ్యాణ్ రామ్ సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన అమిగోస్‌కు త్రిపాత్రాభినయం చేశాడు. డిఫరెంట్ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.