అక్కినేని హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్లతో గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడు. నాగచైతన్య సంబంధించిన తాజాగా వార్తలు నిజం చేస్తూ శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటయ్యారు. వీరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిక్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే నాగార్జున, నాగచైతన్య ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను తమ ఇన్స్టా వేదికగా రివీల్ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రిటీస్ వారికి అభినందనలు తెలియజేశారు. అయితే ఒక వ్యక్తి మాత్రం నాగచైతన్యను కించపరిచే విధంగా కంగ్రాట్స్ పతిత అంటూ కామెంట్స్ చేశాడు.
ఇప్పుడు అతను చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఇలా వ్యంగ్యంగా కామెంట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. అతను మరెవరో కాదు సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్. గతంలో ప్రీతం, సామ్ ఇద్దరు ప్రేమించుకున్నారని ఈ కారణంగానే నాగచైతన్యకు.. సామ్ విడాకులు ఇచ్చేసింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఇటీవల సమంత గుడికి వెళ్లిన సందర్భంలో కూడా ప్రీతం జుకాల్కార్.. సామ్ పక్కనే ఉండడంతో ఇంకా రిలేషన్ షిప్‌లోనే ఉన్నారని అంతా భావించారు.
అయితే ఈ వార్తలకు సమంత.. ప్రీతం ఇద్దరు చెక్ పెట్టారు. తామ స్నేహితులమంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా ప్రీతం జుక్కల్కర్ నాగచైతన్య ఎంగేజ్మెంట్‌ను ఉద్దేశించి తన ఇన్స్టా వేదికగా చేసిన కామెంట్స్ చర్చ నీయాంశంగా మారాయి. ప్రీతం, నాగచైతన్యకు విషెస్ తెలియజేస్తూ కంగ్రాట్స్ పతిత అంటూ స్టోరీ షేర్ చేసిన ప్రీతం.. మరో స్టోరీలో రహస్యాలు మరియు అబద్ధాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంబంధాలను చంపేస్తాయి. మీరు వాటిలో చిక్కుకుంటారు అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం ప్రీతం జుక్కల్కర్ షేర్ చేసిన పోస్ట్ నాగచైతన్యను ఉద్దేశించి అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తన ఫ్రెండ్ సమంత జీవితాన్ని చైతు నాశనం చేశాడని ఉద్దేశంతో ప్రీతం జుక్కల్కర్ ఇలాంటి పోస్ట్ షేర్ చేశాడంటూ తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.