రామ్ విషయంలో బోయపాటికి వ్యతిరేకంగా ఆ పని చేసిన‌ పూరి..!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని చివరిగా బోయపాటి శీను డైరెక్షన్‌లో స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన‌ ఈ సినిమాల్లో శ్రీ లీల హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో రామ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించాడు. రామ్ స్కందా సినిమాలో నటించిన ఓ పాత్ర కోసం బరువు బాగా పెరగాలని బోయపాటి చెప్పడంతో.. అతి తక్కువ సమయంలోనే ఏకంగా 20 కిలోల బరువు పెరిగి సంచలన సృష్టించాడు. ఆ సమయంలో ఈ వార్త నెటింట‌ తెగ వైరల్‌గా మారింది. అలా బోయపాటి తెర‌కెక్కించిన స్కంద కోసం రామ్ బరువు పెరిగి సినిమాపై తనకు ఉన్న డెడికేషన్ చూపించాడు.

Skanda Movie Poster : శ్రీలీలతో రొమాంటిక్ కెమిస్ట్రీ.. విలన్లతో పవర్​ఫుల్​  ఫైట్​.. 'స్కంద' అదరగొట్టేశాడుగా

ఇదిలా ఉంటే తాజాగా రామ్‌ పోతినేని పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో డబ్బులు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గతంలో సక్సెస్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. సినిమాలో హీరోగా నటించిన రామ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగా రామ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Double Ismart Photos, Poster, Images, Photos, Wallpapers, HD Images,  Pictures - Bollywood Hungama

ఇక రామ్‌పోతినేని మాట్లాడుతూ స్కందా సినిమా కోసం బోయపాటి బాగా బరువు పెరగాలని అన్నారని.. అతి తక్కువ సమయంలోనే 20 కిలోలు బరువు పెరిగాను. అయితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే పూరి జగన్నాథ్ కలిశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాదిరిగానే నువ్వు డబల్ ఇస్మార్ట్ లో మరింత సన్నగా కనిపించాలని చెప్పారని.. దీంతో ఈ సినిమా కోసం 18 కిలోల బరువు తగ్గాన‌ని చెప్పుకొచ్చాడు. ఇలా రామ్ అతి తక్కువ సమయంలో సినిమాల కోసం ఒక్కసారిగా 18 కిలోలు తగ్గాడ‌ని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. బోయపాటి సినిమా కోసం బరువు పెరగాలని చెబితే.. పూరి జగన్నాథ్ మాత్రం ఈ విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఉంటూ తన సినిమా కోసం సన్నగా మారాలని చెప్పాడంటూ రామ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.