రిలీజ్ అయిన ఒక్క రోజులో టాప్ వ్యూస్‌తో దుమ్ములేపిన టాప్ – 5 తెలుగు సాంగ్స్ ఇవే..?

తెలుగు సినీఇండస్ట్రీలో రిలీజ అయిన‌ కేవలం 24 గంటలకే అత్యధిక వ్యూస్ సంపాదించి రికార్డ్ క్రియేట్‌ చేసిన టాప్ 5 తెలుగు లిరికల్ వీడియో సాంగ్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ నుంచి చివరిగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన దమ్ మసాలా సాంగ్‌కు 24 గంటల్లో ఏకంగా 17.42 మిలియన్ వ్యూస్‌ దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఇదే సినిమాలో బెన్నీ సాంగ్ విడుదలైన 24 గంటల్లోనే 16.38 మిలియన్ వ్యూస్ సాధించింది.

Guntur Kaaram - Dum Masala Song Promo | Mahesh Babu, Sreeleela | Trivikram  | Thaman S - YouTube

నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమాన‌ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీం తాజాగా సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ చుట్టుమల్లె చుట్టేసావే అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో 15.68 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.

Chuttamalle | Devara Second Single | NTR | Janhvi Kapoor | Anirudh  Ravichander | Shilpa Rao | 27 Sep - YouTube

ఇక మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా నుంచి కళావతి సాంగ్ కి రిలీజ్ అయిన 24 గంటలు 14.78 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే మహేష్ బాబు నటించిన ఇదే సినిమాలో మ మ్మ మ.మ్మ మహేశా.. సాంగ్ రిలీజ్ అయిన 24 గంటలు 13.56 మిలియన్ వ్యూస్ ద‌క్కాయి. ఇలా 24 గంట‌ల్లో టాలీవుడ్ టాప్ వ్యూస్ ద‌క్కించుకున్న‌ టాప్ 5 లిస్టులో.. మహేష్ బాబు సినిమాలోని నాలుగు పాటలే హైయెస్ట్ వ్యూస్ సంపాదించి రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

Sarkaru Vaari Paata | Song Promo - Ma Ma Mahesha