సీనియర్ ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు అలాంటి కామెంట్స్.. షాక్ లో నెటిజన్స్..

తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి నటసింహం తారకరామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు వారి సత్తా చాటుడానికి పుట్టిన మహా మనిషి ఎన్టీఆర్. ఇక రీసెంట్గా గుంటూరు ఎన్టీఆర్ క‌ల్చ‌ర‌ల్‌ అసోసియేషన్‌ని స్థాపించి 55 సంవత్సరాలు పూర్తి కావడంతో అక్కడ యాజమాన్యం ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ప్రముఖ ప్రవచనకర్త.. గరికపాటి నరసింహారావు హాజరై ఎన్టీఆర్ గురించి ఆయన ముక్కును గురించి చేసిన షాకింగ్ కామెంట్స్.. నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి.

garikapati pravachanam, Garikipati Narasimha Rao Pravachanam, Garikapati  Narasimha Rao Pravachanam at new jersey NRI Events | NRI Corner | Non  Resident Indian Information | NRI News | NRI News in Telugu |

ఎన్టీఆర్ గురించి గరికపాటి మాట్లాడుతూ.. నేను ఆయనకు వీరాభిమాని అని.. ఇప్పుడు పై లోకంలో కూడా ఎన్టీఆర్ తన పరిపాలన కొనసాగిస్తున్నారు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రతి తెలుగువారి ఇంట్లో కచ్చితంగా శ్రీకృష్ణదేవరాయలు గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోని ఉంచుకోండి.. మీ పిల్లలకు ఆ ఫోటో చూపించి ఆయన శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పండి అంటూ వివరించాడు. ఇక ఎన్టీఆర్ త‌న జీవితంలో మన తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ.. 1970లో కొంతమంది హిందీ నిర్మాతలు కూడా ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తామని రాముడు, కృష్ణుడి వేషం కోసం అడిగే వారిని.. కానీ ఎన్టీఆర్ వాళ్లకు నో చెప్పేసారు.

రూ.10 లక్షలు ఇవ్వండి తెలుగులోనే చేద్దాం అని అన్నగారు అన్నారనే విషయాన్ని ఇప్పటికే చాలామంది పలు సందర్భాల్లో వివరించారు. తెలుగు అంటే ఎన్టీఆర్ గారికి ఉన్న అమితమైన ఇష్టం గురించి చెప్పుకొచ్చారు.. అంటూ వివ‌రించాడు. అలాగే ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి పాల్గొనడంతో.. ఆయన గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రతి పుట్టినరోజుకి చాలా ఏళ్ల నుంచి పేపర్లో ఎన్టీఆర్ తన బుగ్గపై చేయి పెట్టుకొని ఉన్న ఫోటో ప్రింట్ అవుతూ ఉంటుందని.. ఆ ఫోటో రక్తసంబంధం సినిమాలో సావిత్రి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని బాబుకు అన్నం తినిపిస్తూ చూపించ ఫోటో.. కేవలం ఆ సినిమాలో తప్ప ఆ ఫోటో మరి ఎక్కడ ఉండదు.

సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవితంలోని ఈ ఆసక్తికర విషయాలు.. మీకు తెలుసా! |  Interesting Facts About Legend Sr NTR

అలాంటి ఫోటోను ప్రజలకు చూపించిన చౌదరి గారికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ ముక్కు ఎవరికి రాదని.. ఎందుకంటే అది కోటేరు ముక్కు. పదహారేళ్లు అమ్మాయి అయినా ఆ ముక్కు చూసి ఎన్టీఆర్ వెనుక పడిపోవాల్సిందే.. అలాంటి ముక్కు ఉన్న భర్త దొరికితే ఏ జన్మలో నా ముక్కోటి దేవతలు మొక్కుకున్నట్టే అని వివ‌రించాడు. ఎన్టీఆర్ ముక్కుపై గరికపాటి నరసింహారావు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో..నెటిజ‌న్స్ షాక్ అవుతున్నారు. ఏంటి కేవలం ముక్కు గురించి మాట్లాడుతూనే ఎన్టీఆర్ను ఇంతలా పొగిడేస్తున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఎన్టీఆర్ అభిమానులకు గరికపాటి గారి కామెంట్స్ అమితానందాన్ని ఇస్తున్నాయి.