టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన మూవీ సరిపోదా శనివారం. వివేక్ అత్రేయ డైరెక్షన్లో రూపొందిన మూవీ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్.. సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక బుధవారం నుంచే ఈ సినిమా పేరు ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో రిలీజ్ కూడా అయిపోయింది. దీంతో సినీ ప్రియులంతా ఇప్పటికే సినిమాకు సంబంధించిన రివ్యూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. మరి సినిమాపై వారు ఎలా రియాక్ట్ అయ్యారు ఒకసారి చూద్దాం.
సినిమా ఎంట్రీలోనే డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు. నాని ఇంట్రో అయితే వేరే లెవెల్లో ఉందని.. రెగ్యులర్ ఫార్మాట్ అదే అయినా.. డైరెక్టర్ తీసిన తీరు శనివారం కాన్సెప్ట్ అదిరిపోయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జోక్స్ డీజే సంగీతం మరింత హైలెట్‌గా నిలిచిందట. అతని నుంచి ఈ రేంజ్ మ్యూజిక్ అసలు ఊహించలేదని కూడా జేక్స్ అంటూ.. ఓ నెటిజెన్ రివ్యూ షేర్ చేశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సూపర్. మెయిన్ క్యారెక్టర్స్ అయితే వాళ్ల రోల్స్‌లో జీవించేశారు. ముఖ్యంగా సూర్యా, నానీల మధ్య సీన్లు అదుర్స్. ఒకటి, రెండు సీన్స్ లో నానిని మించిపోయి మరి ఎస్ జె సూర్య డామినేట్ చేశారు.
Review :
Screenplay🕵️♂️ VivekAthreya Not upto The Mark ..1st Half – SJ Surya & Nani Don’t Miss it Theatre
Interval 🥵🥵🥵 🔥🔥🔥🔥
Potharu Motham Potharu2nd Half
Bit booring bit lengthy & a Mass entertainment .
BGM 🥵🔥🥵🔥🥵🔥Over all 3.5/5#SaripodhaaSanivaaram pic.twitter.com/DJstRjHcOu
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐑𝐞𝐝𝐝𝐲 (@_NaveenReddy_14) August 28, 2024
ప్రియాంక మొహన్ తన అందం, అమాయకత్వంతో ఆకట్టుకుంటుంది అంటూ.. మరో నెటిజన్ షేర్ చేసుకున్నాడు. పాటలతో పాటు.. ఈ రేంజ్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఈమధ్య వచ్చిన మరే సినిమాల్లో కనిపించలేదు. గూస్ బంప్స్ తెచ్చేలా మ్యూజిక్ ఉంది. ఫస్ట్ టైం నాని సినిమాను విజిల్స్ మధ్యలో చూసాం. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే దుమ్ము రేపింది అంటూ.. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అనుకున్నంత హైప్ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎమోషనల్ సీన్స్ పండలేదు.. కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్ గా అనిపించాయి. కానీ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా అంటూ ఒక నెటిజన్ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.
#SaripodhaaSanivaaram@JxBe yem taagi kottav bro ah BGM mad antey mad mind lo nundi povatle #Saripodhaasanivaaram
Movie nundi bayata ochinapati nundi vintune unna movie hittuuuu 💯 @NameisNani
Recent ga chusina movies lo satisfying ga unna movie ede @DVVMovies pic.twitter.com/TU2f5aZqaS— Subbu (@allam700423) August 28, 2024
ప్రియాంక తన అందంతో ఆకట్టుకోవడమే కాదు.. నటనతోను అదరగొట్టిందని.. నాని, ఎస్జే సూర్య యాక్టింగ్ అదుర్స్ అంటూ.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని.. మరి కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఫైనల్ గా ఈ మూవీ ఆడియన్స్ రివ్యూ తో పాజిటివ్ టాక్‌ను సంపాదించుకున్నాడు నాని.