నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షురూ..!!

నందమూరి నట‌సింహం బాలయ్య నట వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు ఎప్పటి నుంచే టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కళ్ళు కాయలు కాచేలో చూసినా అభిమానులందరికీ ఎప్పుడు నిరాశ ఎదురయింది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్క అని తెలుస్తుంది. బాలయ్యే కొన్ని సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్లు ఇచ్చారు. అంతేకాదు మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసేసారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో మోక్షజ్ఞకు ఇప్పటి మోక్షజ్ఞకు ఎంతో డిఫరెన్స్ ఉంది. ఈ నేప‌ధ్యంలో ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కి అంత సిద్దమైంద‌ని.. ఇక మూవీ అనౌన్స్మెంట్ ఒకటే మిగిలి ఉందని స‌మాచారం. ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యాన్స్ కు పండగ చేసుకునే అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

త్వరలో మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగనుందని.. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ క్లాప్‌తోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ షురూ కానుందట. ఫిలిం సర్కిల్లో ఈ వార్త తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ వార్త నెటింట‌ వైరల్‌గా మారడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉంటున్నారంటూ.. కుటుంబం రెండుగా చీలిపోనుంది అంటూ.. నందమూరి ఫ్యామిలీలో వివాదాలు చోటుచేసుకున్నాయంటూ ఎన్నో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు వీటికి తోడు చంద్రబాబు జైలుకు వెళ్ళినప్పుడు.. అసెంబ్లీలో చంద్రబాబు భార్య.. ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరుని అవమానించినప్పుడు.. తారక్ సరైన విధంగా స్పందించకపోవడంతో ఈ వార్తలు మరింత గుప్పుమన్నాయి. దీంతో ఎన్టీఆర్, బాలయ్య మధ్యన మరింత దూరం పెరిగిందని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లు. నందమూరి ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటే అంటూ మరికొందరి వాదన. ఇక చంద్రబాబు గెలుపును పొగుడుతూ తారక్‌ వేసిన ట్విట్‌ అందరి దృష్టిని ఆకట్టుకుంది. అయితే ఈ పోస్ట్ ను ఉద్దేశిస్తూ అధికారంలో ఉంటే ఇలా.. లేకుంటే అలానా.. అంటూ విమర్శించిన వారు కూడా ఉన్నారు.

కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ అంత సిద్ధమైన వేళ.. తారక్ చీఫ్ గెస్ట్ గా వస్తు తన ఫస్ట్ డబ్బింగ్ మూవీకి క్లాప్ కొడుతున్నాడు అంటూ వార్తలు వినడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వార్త నిజమైతే బాగుండు అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డైరెక్ట్ చేసేది ఎవరు అనేదానిపై పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఈ లిస్టులో చాలామంది పేర్లే వినిపించాయి. ఒక దశలో బాలయ్య స్వయంగా తన కుమారుడి మూవీకి దర్శకుడుగా వ్యవహరిస్తాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయాలు అన్నిటిపై క్లారిటీ రావాలంటే మాత్రం సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.