యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను నటించి బ్లాక్ బస్టర్ సక్సెసట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్ లో ఆది సినిమాతో మొట్టమొదటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో పడింది. ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహించారు. ఇక వివి వినాయకు డైరెక్టర్గా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఆయన దర్శకత్వంతో తెరకెక్కిన మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఒక్కసారిగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్.. ఆ ఇంటర్వ్యూలో ఆది మూవీ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఆది మూవీ షూట్ టైం లో జరిగిన సంఘటన గురించి వివరించాడు. ఈ మూవీ షూట్ టైంలో జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకుని తెరకెక్కిస్తుండడంతో చాలామంది అతను చిన్న కుర్రాడు.. ఇప్పుడు ఆయనతో ఇలాంటి మాస్ యాక్షన్ సినిమా అవసరమా.. అతనితో ఫ్యాక్షన్ సినిమా ఏంటి.. అసలు వర్కౌట్ అవుతుందా.. అంటూ ఎంతో మంది ప్రశ్నించారని.. అయితే నేను వాళ్ళకి ఇదే చెప్పా. మొదటి నుంచి ఈ సినిమా కథను ఓ స్టూడెంట్ ఫ్రాక్షనిస్ట్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోనే కథను రాసుకున్నానని.. దానినే ఆడియన్స్ కు చూపించాలని అనుకున్నానని.. అందుకే తారక్ ను ఈ ఫ్యాక్షన్ మూవీ కోసం హీరోగా ఎంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఆది సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా డైరెక్షన్‌లో మరోసారి అదుర్స్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. ఇలా వీరి కాంబోలో ఇప్పటివరకు రూపొందిన రెండు సినిమాల్లో రెండు మంచి విజయాలను అందుకోవడమే కాదు.. ఎన్టీఆర్‌కు కూడా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ప్రస్తుతం వి వి వినాయక్ ఇమేజ్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. చివరిగా వివి వినాయక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి హిందీ రీమేక్ చేశాడు. కాగా మూవీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది