రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. ఈ స్టార్ బ్యూటీ మళ్లీ తెలుగు ఇంటి కోడలు కానుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైత‌న్యతోనే ప్రేమలోప‌డి ఇరు కుటుంబాల సమక్షంలో అతన్ని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిద్దరు ఏవో కారణాల‌తో విడాకులు తీసుకున్నారు. ఇక డివర్స్ తర్వాత పలు సినిమాల‌లో నటించిన సమంత.. తర్వాత మ‌యోసైటిస్ బారినపడి ఏడాదిన్న‌ర‌పాటు ఇండస్ట్రీకి దూరమైంది.

Samantha: ఏంటి సమంత పెళ్లి చేసుకోబోయే డైరెక్టర్ తెలుగువారా? సామ్ మళ్ళీ  తెలుగింటి కోడలు కానున్నదా!

ఇలాంటి క్రమంలో తాజాగా సమంత మాజీ భర్త నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లని ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో సమంత కూడా ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ను తెర‌కెక్కించిన తెలుగు డైరెక్టర్ రాజ్ నిడమొరును ఎంగేజ్మెంట్ చేసుకుందని.. వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాతనే అక్కినేని హీరో నాగచైతన్య, శ్యామ్కు డివోర్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ రాజ్‌కు ఇంతకుముందే వివాహమైందట‌. కానీ.. శ్యామ్ తో ప్రేమలో పడిన రాజ్ భార్యకు డివోర్స్ ఇవ్వాలని భావించాడట.

WOW! Samantha to host full season of 'Bigg Boss 6'? - News - IndiaGlitz.com

ఇక రాజ్ నిడమొరు తెలుగు అబ్బాయి కావడం విశేషం. అతను ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ క్రమంలో మరోసారి సమంత తెలుగింటి కోడలు కాబోతుంది అంటూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత, రాజ్ తన ఎఫైర్ గురించి ఎప్పుడైనా రివీల్ చేయవచ్చు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే సమంత దేనిపై రియాక్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.