ఆ విషయంలో బన్నీ, విజయ్ దేవరకొండ లను ఫాలో అవుతున్న నితిన్.. ఏం చేశాడంటే..?!

టాలీవుడ్ యంగ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం సినిమాల పరంగా నత్త నడక నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక విషయంలో మాత్రం స్టార్ హీరోస్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారట నితిన్. ఇంతకీ ఆయన ఏ విషయంలో ఫాలో అవుతున్నాడు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్, విజయ్, బన్నీ, రవితేజలకు ఎప్పటినుంచో మల్టీప్లెక్స్ బిజినెస్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

Hero Nithiin's Top 10 Movie

అయితే తాజాగా బిజినెస్ రంగంలో వారిని అనుసరిస్తూ నితిన్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోనికి అడుగుపెట్టబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నితిన్ కూడా ఏషియన్ సంస్థతో కలిసి ఏఎన్ఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభిస్తున్నట్లు టాక్. ఇక గతంలో నితిన్ కు సంగారెడ్డిలో సితార థియేటర్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ థియేటర్ ఇన్నోవేషన్ లో ఉంది. అయితే ఇదే ధియేటర్‌ను ఏషియన్ సంస్థతో కలిపి సరికొత్త రూపంతో మల్టీప్లెక్స్ నేర్పిస్తున్నట్లు సమాచారం.

After like Mahesh Babu, Allu Arjun, and Vijay Deverakonda; another star  hero to venture into the ownership of multiplexes

ఇక ఈ థియేటర్ నితిన్ ఏషియ‌న్ సితారా అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి రావడం ఖాయం. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి గతంలోనే ఏషియన్ సినిమాస్‌తో జత కలిసి.. మహేష్, విజయ్, అల్లు అర్జున్ భాగమయ్యారు.