నన్ను టార్చర్ చేయకండి.. అతనే నన్ను వదిలేసాడు.. నేను కాదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్..?!

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఒకప్పటి హీరోయిన్గా రేణు దేశాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అయితే సినిమాల‌కు దూరంగా ఉన్నా.. రేణు దేశాయ్‌ ఇప్పటికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తన పిల్లలు ఆఖీరా, ఆద్య గురించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లు అందిస్తూ ఉంటుంది. ఇవి క్షణాల్లో వైరల్ అవుతాయి. నితిన్ తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తన ప్రతి పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ ఏదో విధంగా స్పందిస్తూనే ఉంటారు.

అలా తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిగిన పండుగ హోమం గురించి వివరిస్తుంది. తను తన చేతులతో ప్రసాదం చేశానని.. అలా ప్రత్యేక పూజ చేయడం తను చేత్తో ప్రసాదం చేయడం చాలా ఆనందంగా ఉందని.. ఆ ప్రసాదం చేయడం తనకు ఎంతో ఇష్టమంటూ రాసుకొచ్చింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియో పై పవన్ అభిమానులు రియాక్ట్ అయ్యారు. ఓ నెటిజన్ మాట్లాడుతూ వదినగారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది.. ఆ దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండానే ఆయనకు దూరమయ్యారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు అర్థమైంది. ఏదేమైనా విధి అంత డిసైడ్ చేసింది.

ఈరోజు పిల్లలు అన్నయ్య తోనే ఉన్నారు చాలు. అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నాము వదిన అంటూ కామెంట్స్ చేశాడు. దానిపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ మీకు కొంచమైనా బుద్ధి ఉంటే ఇలా మాట్లాడారు. ఆయనే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు.. నేను ఆయన్ని వదిలేయలేదు.. దయచేసి నన్ను ఇలా టార్చర్ చేయకండి అంటూ దండం పెట్టి కామెంట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇంకో నెటిజన్ మీరు సూపర్ అమ్మ.. అన్న దగ్గర లేకపోయినా పూజలు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కు రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థమేంటి.. నాకు నా సొంత లైఫ్ ఉండదా.. మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఎమోషనల్ అయింది.