అలాంటి నిర్ణయంతో అందరిని ఫిదా చేసిన విశ్వక్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు.. ?!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస‌ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విశ్వక్.. ఎప్పటికప్పుడు వార్త‌లో నిలుస్తూనే ఉంటాడు. తన సినిమాల ప్రమోషన్స్ విషయంలోనో.. లేదా కాంట్రవర్షియల్ కామెంట్స్ తోనో ఆయన పేరు మారుమోగిపోతూనే ఉంటుంది. అయితే తాజాగా విశ్వక్‌ మరోసారి నెటింట వైరల్ గా మారాడు.

Vishwak Sen falling on his knees..! at the pre-release event of 'Ashokavanam lo Arjunakalyanam'..!

అయితే ఈసారీ కాంట్రవర్సీలు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాదు.. ఆయన తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో నెటింట‌ ఆయన పేరు మారుమోగిపోతుంది. ఇంతకీ విశ్వక్ తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి అనుకుంటున్నారా.. తాజాగా విశ్వక్ తన అవయవాలను దానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆయన దానానికి సపోర్ట్ చేస్తూ దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెట్రో రెట్రో నోబుల్ కాజ్‌ ఈవెంట్ కు అతిథిగా హాజరై సందడి చేశాడు.

విశ్వక్ ఈ వేడుకలు తన అవయవాలను దానం చేసినట్లు అఫీషియల్ గా ప్రకటించాడు. ఇలాంటి మంచి పనులలో అందరూ భాగం కావాలని ఆయ‌న వివరించాడు. దర్శకుడు శైలేష్ కలను కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు. అయితే ప్రస్తుతం విశ్వక్ చేసిన ఈ పని నెట్టింటి వైరల్ అవ్వడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు జనం. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను విశ్వక్ హీరోనే అంటూ మెచ్చుకుంటున్నారు.