క్లింకార పిలవాలని అలాంటి పేరు పెట్టుకున్న చిరు.. భలే లాజిక్ తో ఉందే..?!

మెగాస్టార్ చిరంజీవి.. తన కొడుకు రామ్ చరణ్ తండ్రి ఎప్పుడు అవుతాడా.. తనని ఎప్పుడు తాతయ్యని చేస్తాడు అని దాదాపు పదేళ్ళుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది జూన్ 20న ఈ జంట క్లింకారకు జన్మనిచ్చారు. మెగా ఇంటికి మహాలక్ష్మిని తీసుకువచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ఆమె రాకతో మెగా కాంపౌండ్లో సంతోషాలు మొదలయ్యాయి. చిరంజీవి కూడా మనవరాలి రాకతో ఎంతో సంతోషపడుతున్నారు.

Ram Charan drops adorable pic of dad Chiranjeevi with granddaughter on his  birthday - India Today

ఇక తాజాగా ఈ తాత మనవరాలు మధ్యన ఉన్న బంధాన్ని చరణ్ చాలా క్యూట్ వేలో వివరించాడు చ‌ర‌ణ్‌. ఫాదర్స్ డే సందర్భంగా ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. ఇందులో చరణ్ మాట్లాడుతూ క్లింకార గురించి ఆసక్తికర విషయాల్లో షేర్ చేసుకున్నాడు. చిరు, క్లింకార బంధం గురించి చెబుతూ క్లింకార‌తో ఉన్నప్పుడు చిరంజీవి కూడా ఓ చిన్న పిల్లాడిలా మారిపోతారని.. ఆయనను క్లింకారా కొడుతుంటే నాన్న బాగా ఎంజాయ్ చేస్తుంటారు అంటూ వివరించాడు.

Ram Charan gets called India's Brad Pitt! - Telugu News - IndiaGlitz.com

కాగా క్లింకార తనని తాత అని పిలవడం చిరంజీవికి ఇష్టం లేదని.. దీంతో తనను పిలవడం కోసం స్పెషల్ నేమ్ పెట్టుకున్నారంటూ చెప్పుకొచ్చాడు చరణ్. తనని తాత అని పిలవద్దు.. అది చాలా బోరింగ్ గా ఉంది. చిరుత అని పిలవమని చిరంజీవి క్లింకారకు చెప్తున్నారట. అయితే ఆ చిరుత పేరులో కూడా చాలా లాజిక్ ఉంది. చిరంజీవిలో చిరు.. తాతయ్యలో తా ను కలుపుతూ చిరుత అని ఆయన క్లింకారాను పిలవమంటున్నారట. ఆ లాజిక్ తెలిసిన ఫ్యాన్స్ మీ షార్ట్ నేమ్ చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.