ఇంట్లో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రేణు దేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దశాయ్‌.. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్న ఈ అమ్మ‌డు ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి ప‌లు పాత్ర‌లో నటిస్తూ సినిమాల‌లో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచు తన పిల్లలకు.. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ఇటీవల పవన్ ఎన్నికల విజయం సాధించడంతో.. రేణు దేశాయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేసిన సంగతి తెలిసిందే.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు... సంతోషం వ్యక్తం చేసిన నటి

తన తండ్రి విజయాన్ని సాధించిన తర్వాత.. పిల్లలు ఇద్దరు తన తండ్రి వెంటే ఉంటూ ఎంతో మంది ప్రముఖులను కలుస్తున్నారు అంటూ త‌న ఆనందాన్ని వ్యక్తం చేసిన రేణు దేశాయ్.. పిల్లలు నరేంద్ర మోడీ లాంటి వారిని కలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు షేర్ చేసుకుంది. అయితే తాజాగా రేణు దేశాయ్‌.. మరో పోస్ట్ షేర్ చేస్తూ తన ఇంట్లో పూజ కార్యక్రమాలు చేస్తున్నారంటూ వివరించింది. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని సంతోషం వ్యక్తం చేస్తూ స్వామివారికి నైవేద్యం తయారు చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేసింది.

Akira introduces his sister Aadya to PM Modi as Pawan Kalyan watches  amusinly - Telugu News - IndiaGlitz.com

ఈ ఫోటోలో రేణు దేశాయ్ తన చేతులతో స్వయంగా ప్రసాదం చేసి.. పూజ చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందంటూ వివరించింది. హోమం, పూజ చేసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉందంటూ ఆమె పేరుకుంది. అయితే ఈమె తన మాజీ భర్త ఎన్నికలో విజయం సాధించడంతోనే తన ఇంట్లో పూజలు, హోమాలు చేస్తున్నారంటూ.. ఈ ఫోటోలపై పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రేణు మాత్రం ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారన్న విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది.